తెలంగాణ కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా చాటిన ఘనత కేటీఆర్ ది

VNB TV NEWS kmm vempatti Naidu staff reporter

ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటిఆర్..

▪️తెలంగాణ కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటిన ఘనత కేటిఆర్ ది..

▪️మంత్రి పువ్వాడ ఆదేశాలతో BRS అధ్వర్యంలో ఘనంగా కేటిఆర్ పుట్టినరోజు వేడుకలు.

గాడ్ఫాదర్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ అని BRS నేతలు అభివర్ణించారు.

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఖమ్మం నగర బిఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఖమ్మం నగరంలోని 53వ డివిజన్ ఫ్రీడం పార్క్ నందు BRS శ్రేణులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. NSP క్యాంపులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని దాదాపు 920 మంది విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణి చేశారు.

అనంతరం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి క్యాంపు కార్యాలయంలో మహిళ కమిటీ అధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేసి జై తెలంగాణ.. జై కేసీఅర్.. జై కేటిఆర్.. అంటు నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంపిణి చేసి సంబరాలు జరుపుకున్నారు.

తెలంగాణ కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటిన ఘనత కేటీఆర్ గారిదే అని అన్నారు. కేటీఆర్ ఆలోచన విధానాలతో తెలంగాణ అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందన్నారు.

కేటిఆర్ గారి ఔనత్యాన్ని, వ్యక్తిత్వం, పోరాటపటిమ, పరిపాలన విధానం నేటి యువత, నాయకులకు ఆదర్శమని అన్నారు. అనేక విదేశీ కంపెనీ లను ఆకర్షించి తెలంగాణలో పెట్టుబడులు పెట్టించి తెలంగాణ రాష్ట్ర యువతకు లక్షల ఉద్యోగాలు ఇప్పించడం కేటిఆర్ విజయం సాధించారని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఅర్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ఇంతగా అభివృద్ధి అయ్యిందంటే అది కేటీఆర్ చలువేనని పేర్కొన్నారు.

కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, మంత్రి PA రవి కిరణ్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార, కార్పొరేటర్లు దోరేపల్లి శ్వేత, కొత్తపల్లి నీరజ, మక్బూల్, దండా జ్యోతిరెడ్డి, పసుమర్తి రాంమోహన్, బుర్రి వెంకట్ కుమార్, నాయకులు మందడపు మనోహర్, కన్నం ప్రసన్న కృష్ణ, పాల్వంచ కృష్ణ, సైదా రావు, దాదే సతీష్, పాకలపాటి శేషగిరి రావు, కంచర్ల దయాకర్, షకీన, తన్నీరు శోభా రాణి, రమాదేవి, రవి నాయక్, ఏచు ప్రసాద్, అన్ని అనుబంధ సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు