VNB TV NEWS kmm vempatti Naidu staff reporter



స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పారిశుధ్యం పచ్చదనం కార్యక్రమాల లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీమతి అభిలాష అభినవ్ పేర్కొన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ 2023, తెలంగాణ కు హరిత హారం, ఉపాది హామీ పధకము ప్రగతి పై MPDOs, MPOs, APOs, ECs , TA మరియు అన్ని మండలాల పంచాయతి కార్యదర్శులతో వీడియో కాంఫెరన్స్ ద్వారా మండలాల వారిగా స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2023, తెలంగాణ కు హరిత హారం, ఉపాది హామీ పధకము ప్రగతి పై సాధించిన ప్రగతి పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2023 బృందం త్వరలో జిల్లాలో ని గ్రామాలలో పర్యటించి గృహ స్థాయి పారిశుధ్యం, గ్రామంలోని 5 ప్రభుత్వ సంస్థలు అనగా ప్రభుత్వ పాఠశాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ కార్యాలయలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(PHC), ఆలయాలు /చర్చులు /మసీదులలో పారిశుధ్యం పై తనిఖి చేయనున్నారు. పై సంస్థలలొ మరియు గృహాలలో రెండు గుంతల మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు/ కిచెన్ గార్డెన్, రెండు గుంతల మరుగుదొడ్ల మూతలు తప్పనిసరిగా పైకి కనిపించే విధంగా ఉండాలి. రెండు రంగుల (ఆకుపచ్చ మరియు నీలం) డస్ట్ బిన్లు కలిగి ఉండాలి. గ్రామ పారిశుధ్య పరిశీలనలొ భాగంగా గ్రామ పంచాయతి సెగ్రిగేషన్ షెడ్లను తనిఖి చేస్తారు. పొడి మరియు తడి వ్యర్థాలను వేరు చేయడం, కంపోస్ట్ పిట్‌లను తడి చెత్తతో నింపి, వర్మీ కంపోస్ట్ ఉత్పత్తి మరియు విక్రయించిన వివరాలు, పొడి చెత్తను విక్రయించడం మరియు వచ్చిన ఆదాయ వివరాలను సిద్దం గా ఉంచుకోవాలని, బహిష్టు వ్యర్థాలు (Sanitary Napkins)మరియు బయోహజార్డ్ (Medical Waste) వ్యర్థాలు సురక్షిత Disposal కోసం సెగ్రిగేషన్ షెడ్‌లో ప్రత్యేక ఏర్పాటును కలిగి ఉండాలి.గ్రామంలోని డ్రైనేజీ చివరి పాయింట్ల వద్ద కమ్యూనిటీ సోక్ పిట్ తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.అన్ని గృహాలు మరియు సంస్థల నుండి ట్రాక్టర్ ట్రాలీలో పొడి మరియు తడి చెత్తను విడివిడిగా సేకరించాలి. బృందం సందర్శించే సమయానికి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ట్రాక్టర్ మరియు ట్రాలీ పార్టిషియన్ తో సిద్ధంగా ఉంచాలి.
ప్రతి గ్రామంలో SBM వాల్ పెయింటింగ్స్ (9 Nos) సిద్ధంగా ఉండాలి. (ODF ప్లస్‌లో 6 మరియు SSG2023లో 3) సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి మరియు VWSC కమిటీ మెంబర్లు అందుబాటులో ఉండాలి మరియు ఆశా, అంగన్‌వాడీ టీచర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరిశీలన బృందం సందర్శించే సమయంలో అందుబాటులో ఉండాలి.
గడిచిన ఆరు నెలలకు గాను గ్రామ పంచాయతీ తీర్మానాల రిజిస్టర్, గ్రామసభల తీర్మానాల రిజిస్టర్, VWSC మీటింగ్ మినిట్స్ రిజిస్టర్, సెగ్రిగేషన్ షెడ్ యొక్క లాగ్ బుక్, గ్రామ పంచాయతి ట్రాక్టర్ యొక్క లాగ్ బుక్, గ్రామ పటం (Village Map) సిద్దంగా ఉంచాలని ఆదేశించారు.
గ్రామంలో ఎక్కడా చెత్తాచెదారం, ప్లాస్టిక్‌ కవర్లు లేకుండా , అన్ని మురికి కాలువలు శుభ్రంగా ఉండేల జిల్లాలోని అన్ని గ్రామాలను స్వచ్చంగా ఉంచాలని ఆదేశించారు.
హరిత హారంలో భాగంగా జిల్లా మొక్కలు నాటే లక్ష్యం 10 లక్షలను, మరియు పళ్ళ తోటల పెంచే లక్ష్యాన్ని, అన్ని మండలాల వారు రాబోయే 15 రోజులలో పూర్తి చేయాలని అదేసించినారు. మరియు రోడ్లకు ఇరువైపులా నాటే మొక్కలు 10 అడగుల తగ్గకుండా నాటుకోవాలని, బ్రష్ వుడ్ ఫెన్సింగ్ వేసుకోవాలని చనిపొయిన మొక్కల స్థానాలలో మరొక మొక్కలను నాటుకోవాలని, అన్ని రకాల EGS పనుల నందు పురోగతి సాదించాలని అదేసించినారు.

ఈ వీడియో కాంఫెరన్స్ నందు CEO, ZP, ఖమ్మం శ్రీ V.V. అప్పారావు గారు, డిఆర్డిఓ, ఖమ్మం శ్రీమతి యం. విద్యాచందన గారు, అడిషనల్ డి ఆర్ డి ఓ (EGS) శ్రీమతి డి. శిరిష గారు, DLPOs కల్లూరు & ఖమ్మం శ్రీ పుల్లారావు, శ్రీ ప్రభాకర్ రావు గార్లు SBM Consultants శ్రీ నెల్లూరి అనూప్, శ్రీ మహ్మద్ జక్రియ, ప్లాంటేషన్ మేనేజర్ (TKHH) డి. సురేష్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed