









Khammam/24.08.2023
తేజ వార్త ఖమ్మం సిటీ
వర్తక వ్యాపారాలకు అన్ని విధాలుగా అండగా ఉన్నాం.
▪️ ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో మంత్రి పువ్వాడ.
ఖమ్మం వర్తక, వ్యాపారులకు అన్ని విధాలుగా అండగా ఉన్నామని, ఏ నాడు మీకు భారం కాలేదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు..
ఖమ్మం బడ్జెట్ హోటల్ నందు నగర ఆర్యవైశ్యుల అధ్వర్యంలో జరిగిన ఖమ్మం ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో మంత్రి పువ్వాడ పాల్గొని మాట్లాడారు.
గడచిన 9ఏళ్ళల్లో ఏనాడు మీకు భారంగా లేమని, మీ వ్యాపారాలకు చేదోడు వాదోడుగా, అండగా ఉన్నామన్నారు.
ముల్లుకర్ర పట్టుకుని మీ వ్యాపారాలకు, త్రీ టౌన్ కి కాపలాగా ఉంటానని సరిగ్గా 9ఏళ్ల క్రితం చెప్పిన విధంగా నేటి వరకు అదేవిధంగా కట్టుబడి ఉన్నానని చెప్పారు.
త్రీ టౌన్ ను అభివృద్ది చేయాలని తపించామని, ఆర్య వైశ్యులు మన కుటుంబ సభ్యులు అని మా నాన్న పువ్వాడ నాగేశ్వరరావు గారు చెప్పిన విధంగా మీకు ప్రతి నిత్యం అండగా కాపలాదరుడిగా ఉన్నామని స్పష్టం చేశారు.
త్రీ టౌన్ అభివృద్ది జరగాలంటే ముందు గోళ్ళపాడు ప్రక్షాళన కావాలని భావించి సరిగ్గా 2018 ఏప్రిల్ 19వ తేదీన నా పుట్టిన రోజు సందర్భంగా త్రీ టౌన్ లో ఏదైన మంచి పనికి శ్రీకారం చుట్టాలని, ఆ పని జీవితాంతం గుర్తుండిపోవాలనే ఉద్దేశంతోనే వాసవి గార్డెన్స్ వద్ద గోళ్ళ
పాడు ఛానల్ శుభ్రం చేసే కార్యక్రమంను నేనే స్వయంగా దిగి శుభ్రం చేసే పనిని ప్రారంభించామని అన్నారు.
అది నేడు త్రీ టౌన్ మొత్తం ప్రాంతానికి, లక్షల మందికి ఆహ్లాదం పంచుతుందని అన్నారు. మొత్తం మురిగును తీసేసి అండర్ గ్రౌండ్ డ్రైన్ నిర్మించి, ఉపరితలంపై 10 సుందరమైన పార్కులు నిర్మించడం జరిగిందన్నారు.
తద్వారా ఇక్కడ నివాసం ఉండటానికే ఆలోచించిన పరిస్థితుల నుండి ఇక్కడే ఉంటాం అనే స్థాయికి భూములు ధరలు పెరిగాయని, మీ ఆస్తుల విలువ వేల నుండి లక్షల్లోకి పెరిగిందన్నారు.
సగటు మనిషి చివరి మజిలీ అయిన స్మశాన వాటికలు ఒకప్పుడు దుర్భరంగా ఉండేవి.. కనీసం ఆఖరి మజిలీలో అయిన ప్రశాంత వాతావరణంలో అంతిమ సంస్కారం సజావుగా జరగాలనే సంకల్పంతో నాలుగు వైపులా అత్యద్భుతంగా వైకుంఠదామలు నిర్మించి మీకు అందజేశమని అవన్నీ మి కళ్ళ ముందే ఉన్నాయన్నారు.
అభివృద్ధి ఫలాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందించాలని బలంగా కోరుకుంటున్నానని అన్నారు.
మొదలు పెట్టిన అనేక పనులు మధ్యలోనే ఆగకుండా.. అత్తిలి సత్తి అర గుండు మాదిరిగా కాకుండా.. పూర్తి స్థాయిలో అభివృద్ది చేసే అవకాశం ఇవ్వాలని కోరారు.
ఇంకా నగరంలో చేయాల్సిన అనేక పనులు మిగిలి ఉన్నాయని, వాటన్నిటినీ పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉందని, అందుకు మళ్ళీ నన్ను అత్యధిక మెజారిటీ తో గెలిపించడం ద్వారా పూర్తి అవుతాయని అన్నారు.
భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి, రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు పులిపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. ఖమ్మం నగరాభివృద్ధికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు చెప్పిన దానికంటే అత్యధికంగా చేశారని, వారి గెలుపు మా బాధ్యత అని స్పష్టం చేశారు. వారి అభ్యర్థిత్వాన్ని ఆర్య వైశ్య సమాజం సంపూర్ణంగా స్వాగతిస్తుందని వారికే మా మద్దతు అని ప్రకటించారు.
వచ్చే వంద రోజుల్లో అజయ్ కుమార్ గారి గెలుపు కోసం నిర్విరామంగా పని చేస్తామని, అతి త్వరలో వైశ్యుల అధ్వర్యంలో ఖమ్మంలో భారీ సమావేశం ఎర్పాటు చేసి వారికి ఐక్యంగా పని చేసి మేమే గెలిపించుకుంటామని అన్నారు.
కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, షిరిడి సాయి బాబా ట్రస్ట్ చైర్మన్ వేములపల్లి వెంకన్న, వర్తక సంఘం అధ్యక్షుడు చిన్ని కృష్ణరావు, బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కొప్పు నరేష్ కుమార్,GV మాల్ అధినేత గుర్రం ఉమా మహేశ్వర రావు, AMC డైరెక్టర్ దేవత అనిల్, ఆర్య వైశ్య ప్రముఖులు గోళ్ళ రాధాకృష్ణ, జీ శ్రీనివాస్, మిత్ర ఫౌండేషన్ చైర్మన్ కురువెళ్ళ ప్రవీణ్ కుమార్, కొత్త వేంకటేశ్వర రావు, కార్పొరేటర్ పసుమర్తి రాంమోహన్ రావు పాల్గొన్నారు.
