TSRTC కార్మికులు గవర్నమెంట్ లో విలీనం ఆంధ్రప్రదేశ్ అనుభవాలు SWF ప్రతిపాదములు

అనే పుస్తకమును డిప్యూటీ జనరల్ సెక్రటరీ జి లింగమూర్తి

రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ వెంకటేశ్వర్లు గార్ల చేతుల మీదుగా ఖమ్మం డిపో వద్ద ఉదయము ఆవిష్కరణ చేయటం జరిగింది
ఆంధ్రప్రదేశ్ లో విలీనం అయ్యి మూడు సంవత్సరాలు అయినది అక్కడ ఉద్యోగస్తుల వేతనాలు, గ్రాడ్యుటీ ,ఉద్యోగ భద్రత, పెన్షన్ ,పనిగంటలు ,మెడికల్ సౌకర్యాలు ఇలా అనేక సమస్యలపై SWF రాష్ట్ర బృందం అధ్యయనం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేష్ లో ఉద్యోగస్తులకు ఏమి సౌకర్యాలు వచ్చినాయి ఏమి కోల్పోయారో తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగస్తులు అవి కోల్పోకుండా , మంచి ప్రతిపాదనలు తయారు చేసి విలీన కమిటీకి , మేనేజింగ్ డైరెక్టర్ గారికి ,చైర్మన్ గారికి, వినతి పత్రాలు ఇచ్చి మొత్తం ఉద్యోగులకు తెలియపరిచేందుకు అట్టి ప్రతిపాదనలు పుస్తక రూపంలో తీసుకురావడం జరిగిందని అన్నారు ప్రతి ఉద్యోగి పుస్తకాన్ని అధ్యయనం చేసి ఇంకా ఏమైనా సూచనలు ఉంటే డిపో కమిటీకి తెలియజేయాలని కోరినారు

స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ మంచి కృషిచేసి రాష్ట్రవ్యాప్తంగా బుక్ లెట్స్ వేసినారు దానిలో భాగంగా ఖమ్మం డిపో వద్ద పుస్తకావిష్కరణ జరిగిన వెంటనే గ్యారేజీ ,ఎర్నింగ్ సెక్షన్, సెక్యూరిటీ సిబ్బంది, అందరికీ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం రీజినల్ కార్యదర్శి పి సుధాకర్ రీజనల్ నాయకులు జె నాగేశ్వరరావు డిపో అధ్యక్షులు ఎస్ సీతారామయ్య కోశాధికారి జి రోశయ ప్రచార కార్యదర్శి పి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు