













పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు
మంత్రి పువ్వాడ కు అభినందనల వెల్లువ..
▪️మంత్రిగా నాలుగేళ్ళు పూర్తి చేసుకోవడంతో పలువురి అభినందనలు.
▪️ఖమ్మం క్యాంపు కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు.. కార్యకర్తలు, ప్రజల మధ్య కేక్ కటింగ్..
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పలు పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, న్యాయవాదులు, వైద్యులు, జర్నలిస్టులు ఆయనను కలిసి శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు, జ్ఞాపికలు అందజేసి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా Vdo’s క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులు, నాయకులు, పలువురు ప్రజా ప్రతినిధుల నడుమ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
భద్రాచలం శ్రీ సీతా రామ చంద్ర స్వామీ వారి దేవాలయం నుండి ప్రత్యేకంగా వచ్చిన అర్చకులు మంత్రి పువ్వాడకు వేదాశీర్వచనాలు ఇచ్చి భద్రాద్రి రామయ్య ప్రసాదాలను అందజేశరు.
ఎమ్మెల్సీ తాతా మధు, మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, ఎమ్మేల్యే సండ్ర వెంకట వీరయ్య, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, సుడా చైర్మన్ విజయ్‌కుమార్, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ DV, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, ఖమ్మం, కొత్తగూడెం RTA మెంబెర్స్ వల్లభనేని రామారావు, గూడపాటి శ్రీనివాస్, కార్పొరేటర్ లు, వివిధ శాఖల ప్రభుత్వం అధికారులు, సిబ్బంది, డివిజన్ నాయకులు, తదితరులు మంత్రికి శాలువాలు కప్పి సత్కరించారు.
జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అఫ్జల్‌హసన్, ఆర్వీఎస్ సాగర్, నందగిరి శ్రీను, దాసరి రవికుమార్, శాబాసు జ్యోతి, స్వప్న తదితరులు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు మంత్రికి శుభాకాంక్షలు చెప్పి కేక్ కట్ చేయించారు.
