





Khammam/09.09.2023 తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ
రూ.7.40 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ.
ఖమ్మం ప్రధాన రహదారి నుండి 15వ డివిజన్ పుట్టకోట వరకు SUDA నిధులు రూ.7.40కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ మరియు డివైడర్ నిర్మాణ పనులకు పుట్టకొట నందు శంకుస్థాపన చేసిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు.
కార్యక్రమంలో విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ రావూరి కరుణ, కురాకుల వలరాజ్, ఆంధ్ర బ్యాంక్ FSCS చైర్మన్ భీరెడ్డి నాగచంద్ర రెడ్డి, మున్సిపల్ ఎస్ఈ రంజిత్, రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వరరావు, నాయకులు సంక్రాంతి నాగేశ్వరరావు, సైదుబాబు తదితరులు ఉన్నారు.
