Kothagudem/09.09.2023
తేజ వార్త దినపత్రిక తెలంగాణ భద్రాది కొత్తగూడెం జిల్లా సిటీ



రూ.35.40 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి పువ్వాడ.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు విస్తృతంగా పర్యటించి రూ.35.40కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే రేగ కాంతారావు గారితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
పినపాక నియోజకవర్గం బూర్గంపాడు లో RMSA నిధులు రూ.2.70 కోట్లతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(KGBV) ను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, ప్రభుత్వ విప్ రేగ కాంతా రావు గారు.
బూర్గంపహాడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అవరణలో DMFT నిధులు రూ.2.70 కోట్లతో నిర్మించనున్న నూతన భవనం మరియు కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
మణుగూరు శివారు హనుమాన్ టెంపుల్ వద్ద నూతనంగా ఎర్పాటు చేసిన రథంగుట్ట అర్బన్ పార్క్ ను ప్రారంభించారు. అనంతరం పార్క్ అవరణంలో మొక్కలు నాటారు.
మణుగూరులో SDF నిధులు రూ.5 కోట్లతో టీఎస్ ఆర్టీసి నూతన బస్టాండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
మణుగూరు పురపాలక సంఘం పరిధిలో SDF నిధులు రూ.25 కోట్లతో నిర్మించనున్న నూతన మున్సిపల్ కార్యాలయ భవనం, సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్ తదితర అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు.
మణుగూరు మండల కేంద్రంలోని కిన్నెర కల్యాణ మండపంలో ప్రభుత్వ విప్ రేగ కాంతారావు అధ్వర్యంలో జరిగిన BRS పార్టీ ముఖ్య కార్యకర్తలు సమావేశంలో మంత్రి పువ్వాడ కామెంట్స్..
పినపాక ఎమ్మేల్యే బుల్లెట్ మాదిరి ఉన్నాడు.. పని చేసే ఎమ్మేల్యే దొరకడం పినపాక నియోజకవర్గ అదృష్టం.
తన సమయం మొత్తం కేవలం నియోజకవర్గ అభివృద్ది కోసం పని చేస్తాడు.. నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు.. సెక్రటేరియట్ లో చూస్తూనే ఉంట.
ఆర్టీసి నూతన బస్ స్టాండ్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఅర్ గారు ఇచ్చిన SDF నిధుల నుండి రూ.5 కోట్లు వెచ్చించడం మంచి విషయం. ప్రజా రవాణా, ప్రజల అస్తి..
పౌర సేవల కోసం, మణుగూరు అభివృద్ది కోసం రూ.25 కోట్లు కేటాయించడం వారికే సాధ్యమైంది.
దండాలు పెట్టుకుంటు.. తల నిమురుకుంటు.. మెడ వంకర పేట్టి కౌగులిలించుకుంటే జరిగుతదా అభివృద్ది.
నిధుల వేట కోసం రేగ కాంతారావు నిత్యం తిరుగుతారు. అలాంటి మంచి ఎమ్మేల్యే ఉండటం మీ అదృష్టం.
ఇలాంటి వాళ్ళను గెలిపించుకోవాలి. BRS ప్రభుత్వంను తెచ్చుకోవాలి.
కాంగ్రెస్ పార్టీకి బ్యాటరీ ఛార్జింగ్ ఏ ఉండడు. అది ఏనాడో ఎప్పుడో తుప్పుపట్టిపాయింది. మళ్ళీ పని చేయదు.
కరోనా సమయంలో మీరేం చేశారు..? గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్తాం. మేం పనిచేశామని. BRS ప్రభుత్వం పని చేసింది.. BRS కార్యకర్తలు తమకు తోచిన రీతిలో పని చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు 16వేల మందికి పోడు భూములు పట్టాలు ఇచ్చినం.. కేసీఅర్ గారు ఇచ్చారు. కొన్ని ఏళ్లు పరిపాలన చేసిన కాంగ్రెస్ ఏం చేసింది. మీరేం చేశారు..?
గోదావరి వరదలు వచ్చాయి.. ప్రజల ప్రాణాలు ఒక్క ప్రాణం అంటే ఒక్క ప్రాణం పోకుండా కంటికిరెప్పలా కాపాడుకున్నాం. గోదావరి అటువైపు నేను .. ఇటు వైపు రేగ కాంతారావు వరదల్లో పని చేశాం. మీరేం చేశారు..? ఇక్కడ నిద్రపోయారు చెప్పాలి.
అలాంటి వాళ్ళను మనం గెలిపించుకోవాలలి. మనకు పని చేసే వారినే మనం గెలిపించుకోవాలి..
ముఖ్యమంత్రి కేసీఅర్ గారు మన జిల్లా రైతాంగం కోసం, ప్రజల కోసం రూ.13వేల కోట్ల రూపాయల సీతారామ ప్రాజెక్ట్ ను తీసుకొచ్చి లక్షల ఎకరాలకు సాగునీరు, త్రాగునీరు అందించేందుకు ప్రాజెక్ట్ తెచ్చారు.
మనం కేసీఅర్ గారికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5సీట్లు, ఖమ్మం జిల్లా లోని 5 సీట్లు గెలిపించుకుని కేసీఅర్ గారికి కనుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈసారి మనం మన పార్టీ నీ గెలిపించుకోవాలని కోరారు.
