Khammam/13.09.2023/తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ

వైద్య రంగానికి హబ్ గా నిలువనున్న ఖమ్మం..

▪️పాత కలెక్టరేట్, R&B కార్యాలయం కలుపుకొని 8 ఎకరాల్లో వైద్య కళాశాల ఏర్పాట్లు పూర్తి.

▪️ఈ విద్యా సంవత్సరంలో 100 సీట్లతో తరగతులు ప్రారంభం..

▪️లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రులు హరీష్ రావు గారు, పువ్వాడ అజయ్ గారు.

ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం అయింది. పాత కలెక్టరేట్, రోడ్డు భవనాల శాఖ కార్యాలయం కలుపుకొని 8 ఎకరాల్లో వైద్య కళాశాల ఏర్పాట్లు పూర్తయ్యాయి.

గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు గారు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు వైద్య కళాశాలను ప్రారంభించనున్నారు.

కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరం నుంచి నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ చట్టం ప్రకారం అనుమతి లభించిన దరిమిలా తరగతుల నిర్వహణకు సిద్దంగా ఉంది. ఈ విద్యా సంవత్సరం నుండి 100 సీట్లతో తరగతులు ప్రారంభం కానున్నాయి. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది.

పాత కలెక్టరేట్ భవనాన్ని రెన్నోవేషన్ చేపట్టి, రూ.8.5 కోట్లతో పరిపాలన, లైబ్రరీ, పరీక్షలు, టీచింగ్ హాళ్లు గా, పాత పౌరసరఫరాల కార్యాలయం, ఇవిఎం గోడౌన్ ను మ్యూజియం, బయో కెమిస్ట్రీ, క్లినికల్ ఫిజియాలజీ, హేమటాలజీ, అంఫిబియా ల్యాబ్ లు, డిసిక్షన్ హాల్, లెక్చర్ హాళ్లు, పాత గిరిజనాభివృద్ది అధికారి కార్యాలయంలో బయో కెమిస్ట్రీ, అనాటమి శాఖల అధికారులు, సిబ్బంది కార్యాలయం, పాత రోడ్డు భవనాల శాఖ కార్యాలయంలో బాలికల హాస్టళ్లుగా తీర్చిదిద్దారు.

ల్యాబ్ లకు సంబంధించి పరికరాలు, కళాశాలకు సంబంధించి ఫర్నీచర్, కంప్యూటర్ సామాగ్రి అంతా ఏర్పాటు పూర్తయింది. అంతర్గత రహదారుల నిర్మాణం పూర్తయింది.

ప్రభుత్వ వైద్య కళాశాల కు ప్రభుత్వం 6 గురు ప్రొఫెసర్లు, 5 గురు అసోసిసియేట్ ప్రొఫెసర్లు, 27 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను కేటాయించగా, వారందరూ విధులకు రిపోర్ట్ చేశారు. ఇప్పటికే కళాశాల నిర్మాణం కొరకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.166కోట్లను మంజూరు చేసింది.

ఖమ్మం ఆసుపత్రిలో ఉన్న అధునాతన పరికరాలు, సౌకర్యాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాతో పాటు పొరుగున ఉన్న మహబూబాబాద్‌, సూర్యాపేట, ఆంధ్రప్రదేశ్ లోని సరిహద్దు జిల్లాల నుంచి కూడా వైద్యం కోసం రోగులు వస్తున్నారని, దీంతో ఖమ్మం మెరుగైన వైద్యానికి కేంద్రంగా ఇప్పటికే గుర్తింపు పొందిందని, వైద్య కళాశాల ప్రారంభం కానున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఖమ్మం వైద్య రంగానికి హబ్ గా నిలువనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు