Khammam/14.09.2023

తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ

ఘనంగా మమత సిల్వర్ జూబ్లీ వేడుకలు..

మమత మెడికల్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా Combined Annual Day వేడుకలు మమత కళాశాల ప్రాంగణంలో ఘనంగా జరిగాయి.

మమత వైద్య విద్యా సంస్థల ఫౌండర్ పువ్వాడ నాగేశ్వరరావు గారి 85వ పుట్టిన రోజు సందర్భంగా కళాశాల విద్యార్థుల నడుమ జరుపుకున్నారు.

మమత వైద్య విద్యా సంస్థల చైర్మన్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఫౌండర్ పువ్వాడ నాగేశ్వర రావు గారు మాట్లాడారు..

మమత మెడికల్ కాలేజీ ఆవిర్భావం నుండి వైద్య విద్యలో ఎక్కడ రాజీ లేకుండా స్థాపించిన నాటి నుండి వేల మంది అండర్ గ్రాడ్యుయేట్స్ , పోస్ట్ గ్రాడ్యుయేట్స్ లను సమాజంకు అందించిన ఘనత మమత కే దక్కిందన్నారు.

సాంఘిక దురాచారమైన ర్యాగింగ్‌ కు వ్యతిరేకంగా ప్రతి ఏడాది మంచి ఫలితాలతో ప్రతి ఏడాది విజయవంతంగా వైద్య విద్యను పూర్తి చేస్తున్నారని అన్నారు.

మమత సంస్థ వైద్య విద్యతో పాటు ప్రతి నిత్యం గ్రామీణ ప్రజల కోసం వైద్య విద్య మరియు ఆరోగ్య సంరక్షణలో భాగంగా అనేక ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తు, అనేక వినూత్న విధానాలతో వైద్యులను తయారు చేయడం మమత మెడికల్ కాలేజీ యొక్క లక్ష్యాలలో ఒకటని ఆయన అన్నారు.

నేడు రాష్ట్రంలో వైద్య రంగంలో మమత ప్రత్యేక స్థానంను కైవసం చేసుకుంది, ముఖ్యంగా కొవిడ్ సమయంలో మమత ఆసుపత్రి అందించిన సేవలు అమోఘం అన్నారు.

కోవిడ్ సమయంలో కోవిడ్ ప్రత్యేకం ఆసుపత్రిగా పని చేసిందని, మహమ్మారి కారణంగా అనేక మంది మనం ఆప్తులను కోల్పోయిన పరిస్థితులు బాధకరమన్నారు.

1998లో స్థాపించి కేవలం 100 సీట్లతో ప్రారంభం కాగా 2003 లో తొలి బ్యాచ్ పస్ ఔట్ అయిందన్నారు.

నేటి వరకు 20 (MBBS)బ్యాచ్ లకు గాను 2500 మంది, PG లో 18 బ్యాచ్ లకు గాను 1200 మంది వైద్యులను తయారు చేయడం గర్వంగా ఉందన్నారు.

నేడు మొత్తం 23 వివిధ విభాగాల్లో MD, MS, సూపర్ స్పెషాలిటీలలో వైద్య సేవలు అందిస్తున్నామన్నరు.

అనంతరం వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు హాన్సా మెమోరియల్ తరుపున మెమెంటోస్ ను వారు అందజేశారు.

కార్యక్రమంలో సంస్థ సెక్రటరీ పువ్వాడ జయశ్రీ, డైరెక్టర్స్ పువ్వాడ నయన్, పువ్వాడ అపర్ణ, పువ్వాడ నరేన్, సాయి శిరిని, పెరుమాళ్ళ శ్రీలత, చైతన్య సాగర్, కాటా సత్యనారాయణ బాబ్జీ, కొత్తూరు ప్రభాకర్ రావు, ఎస్.జనార్ధన్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ అనిల్ కుమార్, డెంటల్ కాలేజ్ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు,
నర్సింగ్ ప్రిన్సిపాల్ కృష్ణ తులసి, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అనురాధ, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు