Vnb న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు
ఖమ్మం సెప్టెంబరు,30 :.
కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో గోద్రెజ్‌ కంపెని రూ.70 కోట్లతో నెలకొల్పనున్న పామాయిల్‌ ఫ్యాక్లరీకి రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కమార్‌తో కలిసి శంఖుస్థాపన చేశారు. శనివారం జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రి మొదటిగా కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో నెలకొల్పనున్న పామాయిల్‌ ఫాక్టరీకి శంఖుస్థాప చేశారు. ఈ సందర్భంగా మంత్రి కె.తారకరామారావు మాట్లాడుతూ గుబ్బగుర్తిలో గోద్రెజ్‌ కంపెనీ నెలకొల్పనున్న ఫామాయిల్‌ ఫ్యాక్టరీలో యువతకు మంత్రి ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. హైద్రాబాదు నగరంతో పాటు నగరాల్లో వివిధ ఫార్మా, ఐటి ఇతర రంగ సంస్థలు పరిశ్రమల స్థాపనకు మొగ్గుచూపడం అభినందనీయమన్నారు. గోద్రెజ్‌ కంపెనీ నిర్మిస్తున్న ఫ్యాక్టరీని ఈ ప్రాంత రైతులు సద్వినియొగం చేసుకొని, ఆర్థికంగా పైకి ఎదగాలని మంత్రి తెలిపారు.

కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీలు బండి పార్థసారధి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్‌, మాజీ ఎమ్మెల్యే మదన్‌ లాల్‌, డిసిసిబి చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, రైతు బంధు జిల్లా కన్వీనర్‌ నల్లమల వెంకటేశ్వరరావు, బాలసాని లక్షీనారాయణ, జిల్లా కలెక్టర్‌ విపి గౌతమ్‌, గోద్రెజ్‌ కంపెనీ ప్రతినిధులు , స్థానిక ప్రజాప్రతినిదులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed