డిసిసిబి సీఈవో శ్రీ అట్లూరి వీరబాబు పదవీ విరమణ:-
ఆర్బిఐ ఫిట్ అండ్ ప్రాపర్ క్రైటీరియా ప్రకారం ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నందు ది.19.10.2020 నాడు బ్యాంక్ సీఈఓ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ అట్లూరి వీరబాబు గారు ఈరోజుతో మూడు సంవత్సరాల కాల పరిమితి ముగియడంతో పదవీ విరమణ కార్యక్రమాన్ని బ్యాంక్ ప్రధాన కార్యాలయము ఖమ్మం నందు బ్యాంక్ అధ్యక్షులు శ్రీ కూరాకుల నాగభూషయ్య గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగినది.
ఈ సందర్భంగా బ్యాంకు అధ్యక్షుల వారు మాట్లాడుతూ వీరబాబు గారు బ్యాంక్ సీఈవో బాధ్యతలు స్వీకరించిన నాడు బ్యాంకు సుమారు 7.50 కోట్ల నష్టములలో ఉన్నదని అటువంటి స్థితి నుండి ఈరోజు బ్యాంక్ 22 కోట్ల లాభములో అర్జించే స్థాయికి వచ్చిందని మరియు ఎన్ పి ఏ లను గణనీయంగా తగ్గించాము అని సుమారు 90 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు, 50 మందికి బ్యాంకులో ఉద్యోగాలను కల్పించాము. సుమారు 70 సంఘములకు 30 కోట్లతో గోదాములను మరియు ఆఫీస్ బిల్డింగులను నిర్మించాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూనవరం, కుక్కునూరు బ్రాంచ్ లను తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక, అన్నపురెడ్డిపల్లి ప్రాంతాలకు తరలించామని బ్యాంక్ పాలకవర్గ సహాకారముతో సీఈవోగా వీరబాబు గారు జిల్లా యావత్ రైతాంగానికి విశేషమైన సేవలందించారని కొనియాడారు. బ్యాంక్ అధ్యక్షులు శ్రీ కూరాకుల నాగభూషయ్య గారి దంపతులు మరియు పాలకవర్గ సభ్యులు సీఈఓ వీరబాబు గారి దంపతులను ఘనంగా సత్కరించారు.వారి భావి జీవితం సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.

ByVNB News

Oct 18, 2023

బ్యాంక్ సీఈఓ వీరబాబు గారు మాట్లాడుతూ ఈ మూడు సంవత్సర కాల పరిమితిలో బ్యాంకును మంచి స్థానంలో ఉంచుటకు శక్తి వంచన లేకుండా పనిచేశానని అభివృద్ధి దిశకు ప్రయాణం చేయుటకు నా వంతు కృషి చేశానని, బ్యాంక్ అధ్యక్షులు మరియు పాలకవర్గ సహకారంతో అధికారులు మరియు ఉద్యోగస్తుల సహకారంతో బ్యాంకును క్రమ పద్ధతిలో నడిపేందుకు కృషి చేశానని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిర్వహించినందుకు బ్యాంక్ అధ్యక్షుల వారికి పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలియజేసినారు.

ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉపాధ్యక్షులు దొండపాటి వెంకటేశ్వరరావు గారు, డైరెక్టర్లు జనగం కోటేశ్వరరావు గారు, నిర్మల పుల్లారావు గారు, చావా వేణు గారు, వేముల శ్రీనివాసరావు గారు, నూకల సైదులు గారు, కోరం జానికి రావు గారు, ఖమ్మం జిల్లా డిసిఓ K. విజయ కుమారి గారు, ఎస్ డి ఆర్ ఓ ఎస్ డి వెంకటేశ్వర్లు గారు, బ్యాంక్ జిఎం K. నర్మద, A. పద్మావతి డీజిఎంలు, ఏజీఎం లు అధికారులు మరియు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు