




Khammam/04.11.2023
తేజ న్యూస్ తెలంగాణ ఖమ్మం సిటీ. ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు
అరాచక పరిపాలన జరిగిందో.. అభివృద్ది జరిగిందో మీ స్వయ అనుభవంలోనే ఉంది..
ఖమ్మం నగరంలో అరాచక పరిపాలన జరిగింది అంటు కాంగ్రెస్ అభ్యర్థి వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని, ఇక్కడ అరాచకం జరిగిందో.. అభివృద్ది జరిగిందో మీ స్వీయ అనుభవంలోనే ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.
ఖమ్మం నగరం 53వ డివిజన్ నందు బెల్లం సుజాత అధ్వర్యంలో ఎర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ గారు పాల్గొని మాట్లాడారు.
ఖమ్మంలో ఎం జరిగిందో చెప్పడానికి అసలు ఈ పెద్ద మనిషి ఖమ్మంలో ఏనాడైన ఉంటే కదా తెలిసేది..
గడచిన ఆయన 40ఏళ్ల రాజకీయ జీవితంలో గెలిచిన ఇక్కడ లేదు.. ఓడినా ఇక్కడ లేదు.. ఉంటే హైద్రాబాద్ లేదంటే సత్తుపల్లి..
నేటి వరకు మా కుటుంబం ప్రజల వద్ద ఏమీ ఆశించి రాజకీయం చేయలేదు. ప్రజా జీవితం లో ఓడినా ఇక్కడే ఉన్నాం.. గెలిచినా ఇక్కడే ఉన్నం..
40 సంవత్సరాల మీ రాజకీయ జీవితం అని గర్వంగా చెప్తున్నారు కదా.. BRS ప్రభుత్వం వచ్చే వరకు ఇన్నేళ్లు గడచిన ఇంకా జిల్లా అన్ని రంగాల్లో వెనుకబాటు తనంలో ఎందుకు ఉంది..
అంటే మీరు ఈ జిల్లాకు ఏమీ చేయలేదు అని ఒప్పుకుంటున్నారా.. ఎందుకు పనికిమాలిన మాటలు చెప్పు ప్రజలు మోసం చేసి అధికారాన్ని దక్కించుకావడానికే కదా అని ప్రశ్నించారు.
ఇక్కడ మా కుటుంబం మమత ఆసుపత్రి నిస్థాపించి మమత ను జనతా గా మార్చి లక్షల మంది పేద ప్రజల ఆరోగ్యం కోసం నిలబడిన విషయం జిల్లా ప్రజలకు తెలుసు.
ఇక్కడ గతంలో నా చేతుల్లో ఓడిపోయి మూలకు కూర్చున్న నిన్ను మంత్రిని చేసింది కేసీఅర్ గారు.. ఆ మాత్రం జ్ఞానం లేకుండా వారికి కూడా వెన్ను పాటు పొడిచి నేడు దర్జాగా కాంగ్రెస్ నుండి మళ్ళీ పోటీకి దిగావ్..
ఖమ్మం ప్రజలు వెళ్లగొడితే పాలేరు పోయావ్.. అక్కడ కూడా వెళ్లగొట్టరు.. మళ్ళీ ఇక్కడ కు చేరుకున్నావ్.. కేవలం పదవి మీద వ్యామోహం తప్ప మీ 40 ఏళ్ల చరిత్రలో ఏనాడైనా ప్రజా సమస్యల పైన పోరాడిన సందర్భాలు ఉన్నాయా.. అసలు జైతెలంగాణ అన్నావా.. అన్న వాళ్ళను జైల్ కు పంపించావు.
BRS పార్టీ మీకు ఏం తక్కువ చేసింది.. ఎం పదవులు ఇవ్వలేదు..? మీకు వచ్చిన అన్ని అవకాశాలు వేరే వాళ్లకు రాలేదు..
2018 ఎన్నికల్లో ఇక్కడ కేసీఅర్ గారు ప్రజా ఆశీర్వాద సభ పెట్టిన నాడు చెప్పారు ఇక్కడ పువ్వాడ అజయ్ ని గెలిపిస్తే పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు అని అన్నారు.. నాకు రామ్(కేటీఆర్) ఎంతో అజయ్ కూడా అంతే అని నాడు చెప్పారు.
వారు నాడు చెప్పిన విధంగానే నేను గెలిచిన వెంటనే మంత్రి పదవి ఇచ్చి.. ఇక్కడ రూ.3500 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు.
ఇప్పటికే రూ.2500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృధ్ది చేయడం జరిగింది. ఇంకా రూ.1500 కోట్లకు శంకుస్థాపన చేశాం వాటిని కూడా ప్రజల కోసం కర్చు చేస్తాం..
ఇక్కడ కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారికి ఉన్న అవగాహన 40ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న వాళ్లకు లేకపోవడం విచారకరం.
BRS పార్టీ ఆదరణ చుసి తట్టుకోలేక విచక్షణ కోల్పోయి ఆరోపణలు చేస్తున్నావు.. ఏదో ఏదో మాట్లాడి ప్రజలను తప్పు దోవ పట్టించాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు బుద్ది చెప్పాలి.. BRS కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా..
సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య, బొడెపుడి వీరయ్య బాబు, అవిరినేని శేషయ్య, ఆళ్ళ సాంబశివరావు, పోట్ల శ్రీకాంత్, బత్తుల మురళీ, తాళ్లూరి దిలీప్ చౌదరి, గుప్తా, మేకల సుగుణ రావు, మేదరమెట్ల స్వరూపరాణి తదితరులు ఉన్నారు.
