ఐదేళ్ల భవిష్యత్తుకి 23రోజులు కష్టపడండి

  • ఎన్ని పనులున్నా ఓపికచేసుకుని ఎన్నికలపై దృష్టిపెట్టండి
  • నేలకొండపల్లి, కూసుమంచి బూత్ కమిటీల సమావేశాల్లో తుమ్మల, పొంగులేటి నేలకొండపల్లి / కూసుమంచి : “ఎన్నికల కురుక్షేత్రానికి ఇంకా తక్కువ రోజులే మిగిలి ఉన్నాయి… ఎన్ని పనులున్నా ఓపిక చేసుకుని ఎన్నికలపై దృష్టి పెట్టండి… ఇందిరమ్మ రాజ్యం • కోసం కృషి చేయండి… తద్వారా ఐదేళ్ల భవిష్యత్తు ఉంటుందని మేము హామీ ఇస్తున్నాం” అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. నేలకొండపల్లి మండలంలోని సీతారామ ఫంక్షన్ హాల్లో, కూసుమంచి మండలంలోని బి.వి. రెడ్డి ఫంక్షన్ హాల్లో శనివారం కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సభ్యుల అవగాహన సమావేశం జరిగింది. వేర్వేరు సమయాల్లో జరిగిన ఈ సమావేశాలకు తుమ్మల, పొంగులేటి ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో యావత్ తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా వెనుకబాటుకు గురైందని విమర్శించారు. రెండు సార్లు మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఈసారి కూడా ఓట్లు దన్నుకొని ప్రజలను మోసగించేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రధానంగా ఈసారి జరగబోయే ఎన్నికల్లో డబ్బు ఎరగా చూపి ప్రజలను మభ్యపెట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. వీటన్నింటిని తిప్పికొట్టాలంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అమలుచేయబోయే ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సూచించారు. దాంతో పాటు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కల్పించిన సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, లబ్ధి పొందిన వారి వివరాలను సేకరించి ప్రజలకు ఉదాహరణగా చూపాలని సూచించారు. ఈ 23రోజుల పాటు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కొత్తపాత అనే తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు రాయల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిషోర్ తో పాటు ఆయా మండలాల కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, నూతనంగా నియమించిన బూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు