అక్రమంగా ఆక్రమించిన పట్టా భూమిని ఇప్పించండి
— చంపుతానని బెదిరిస్తున్న మాటేటి నాగేశ్వరావు, యర్రా గోపీలపై కఠిన చర్యలు తీసుకోవాలి
— విలేకరుల సమావేశంలో బాధితుడు పద్మం వెంకటేశ్వర్లు

ఖమ్మం, జనవరి 4 : పట్టా పాస్ బుక్ కలిగిన ఎకరం 13 కుంటల భూమిలో 9 కుంటల భూమిని అక్రమంగా ఆక్రమించుకొని పెద్దల సమక్షంలో అడిగితే చంపుతానని బెదిరిస్తున్న మాటేటి నాగేశ్వరరావు, యర్రా గోపీలపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ఖమ్మం శ్రీనివాసనగర్ కు చెందిన పద్మం వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఖమ్మం అర్బన్ మండలం, దంస్లాపురం రెవిన్యూ పరిధిలోని సర్వే నెంబర్ : 32/అ లో ఎకరం భూమి, సర్వే నెంబర్ : 32/ఇ/1లో 13కుంటలు భూమి మొత్తం కలిపి ఎకరం 13కుంటల వ్యవసాయ భూమిని యర్రా శైలజ, భర్త యర్రా గోపి వద్ద నుండి నా భార్య పద్మం రమాదేవి పేరుమీద కొనుగోలు చేసి 6526/2015లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని తెలిపాడు. భూమికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు నా వద్దనే ఉన్నాయన్నారు. నా చిన్న కుమార్తె వివాహము నిమిత్తం సదురు భూమిని విక్రయించదలసి సర్వే చేయించగా సదరు భూమి ఎకరం 13 కుంటలకు గానూ ఎకరం 4 కుంటల భూమి మాత్రమే ఉన్నదని సర్వేయర్ రిపోర్టు ఇచ్ఛాడన్నాడు. మిగతా 9 కుంటల భూమి కార్పొరేటర్ మాటేటి అరుణ భర్త, మాటేటి నాగేశ్వరరావు ఆక్రమణంలో ఉందని తెలిపారు. పెద్ద మనుషుల సమక్షంలో అడిగితే యర్రా గోపి ప్రోద్బలంతో మాటేటి నాగేశ్వరరావు చంపుతానని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ఇట్టి విషయమై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ లకు కూడా ఫిర్యాదు చేశానని, సదరు భూపత్రాలు పరిశీలించి, సర్వే నిర్వహించి, మా భూమిని మాకు అప్పగించి, చంపుతానని బెదిరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు పద్మం వెంకటేశ్వర్లు వేడుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు