





ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి,28: మన జ్యోతి
కార్పోరేషన్ ఆదాయ వనరులను పెంపొందించే దిశగా ప్రణాళిక బద్దంగా చర్యలు చేపట్టి కార్పోరేషన్‌లో ప్రత్యేక మార్పులు తీసుకురావాలని నగర మేయర్ పునుకొల్లు నీరజ తెలిపారు. నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, నగర మేయర్ ఆధ్యక్షతన బుధవారం జరిగిన బడ్జెట్ సమావేశంలో 2023 24 సవరణ 220.54 కోట్లు, 202425 ఆర్ధిక సంవత్సరపు బడ్జెట్ రూ.187.86 కోట్లతో రూపొందించిన అంచనాలు ఆమోదించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాబోయో ఆర్ధిక సంవత్సరంలో ఇంకా నిధులను సమకూర్చుకొని మరింత అభివృద్ధి చెందాలన్నారు. శానిటరీ వర్కర్లు మంచిగా పనిచేసి నగరాన్ని పరిశుభంగా ఉంచడం వల్ల ప్రజలకు మంచి వాతావరణం అందించినట్లయితే పాలక వర్గానికి మంచి పేరు వస్తుందని, వారి సేవలను గుర్తించి ప్రభుత్వం వారికి కనీస వేతనం పెంచడం జరిగిందని, ప్రతి నెలా వేతనాలు ఇచ్చేందుకు కార్పోరేషన్ నిదులను నుండి మొదటగా వేతనాల చెల్లింపులు చేసేందుకు ప్రాధన్యత ఇవ్వడం జరిగిందన్నారు. బడ్జెట్ కేటాయింపులో 10 శాతం తప్పనిసరిగా గ్రీనరీ కొరకు వినియోగించాలని, గృహా, వాణిజ్య సముదాయాలన్నింటిని గుర్తించి పన్నుల వసూళ్ళను పకడ్బందీగా నిర్వహించి ఆదాయ వనరులను పెంపొందించుకోవాలని, భవన నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలని, నగర ప్రజల అవసరాలకనుగుణంగా పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయడం జరగుతుందన్నారు. 202324కు సంబంధించి మున్సిపల్ సాధారణ నిధుల నుండి సవరించిన 78.68 కోట్లకు ఆమోదం తెలిపారు. 202425కు సంబంధించి మున్సిపల్ సాధారణ నిధుల నుండి రూ.80.67 కోట్లు బడ్జెట్‌ను ఆమోదించడం జరిగింది.
శాసనమండలి సభ్యులు తాతా మధుసూదన్ మాట్లాడుతూ బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా పనులు చేపట్టి పూర్తి చేయాలన్నారు. గ్రీనరీకి కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో వినియోగించలన్నారు. మున్సిపల్ ఆదాయంకు సంబంధించి పూర్తి స్థాయిలో అద్దెలను వసూలు చేసి ఆదాయం పెంపొందించుకోవాలన్నారు.
కార్పోరేటర్లు నగరంలో త్రాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, నగరంలో పారిశుధ్య వ్యవస్థను మరింత మెరుగుపర్చి పట్టణాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దాలన్నారు.
