ఖమ్మం బ్యూరో మార్చ్ 6 మన జ్యోతి
ఏసీపీ కార్యాలయం వైరా…

అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ 400 బస్తాల రేషన్ బియ్యం… వైరా ఏసీపీ

ప్రజా పంపిణీ బియ్యంతో దందా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వైరా ఏసీపీ రహెమాన్ అన్నారు.

బోనకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని రవినూతల వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న 400 బస్తాల రేషన్‌ బియ్యాన్ని బోనకల్లు ఎస్సై మధుబాబు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు బోనకల్లు పోలీస్ అధికారులు వాహనాలను తనిఖీ చేస్తుండగా జగ్గయ్యపేట నుంచి రాజమండ్రికి వెళ్తున్న లారీని తనిఖీ చేశారు. AP16TY6599 నెంబర్ గల
లారీలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 400 బస్తాలు /ఇరువై టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం ఎక్కడి నుంచి సేకరించి ఎక్కడికి తీసుకెళ్తున్నారు. ఎవరు ఈ పనికి పురామయించారు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారని, ప్రాథమికంగా
షేక్ మస్తాన్ 30 సం, డ్రైవర్ జగ్గయ్యపేట. – షేక్ ఇనౌతుల్లా 40 సం, యజమాని r/o జగ్గయ్యపేట. ఆర్గనైజర్ ఆత్మకూరి జగదీష్ r/o ఖమ్మం. పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలనే పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు పోలీసులు అధికారులు అక్రమ వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు.

అక్రమ వ్యాపారం చేస్తున్న నిర్వాహకులపై కేసు నమోదు చేయడంతో పాటు తరచూ నేరం చేస్తూ పట్టుబడితే పీడీ యాక్ట్‌ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.ర్రాష్ట్ర సరిహద్దు రవాణాపై నిఘా పెట్టామని, తనిఖీలు ముమ్మరం చేశామని ఇలాంటి అక్రమార్కులపై కఠినంగా వ్యవహరిస్తామని
వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు