తుమ్మలకు కృతజ్ఞతలు తెలిపిన తిలక్

ఖమ్మం బ్యూరో మార్చి 13 (మన జ్యోతి) తాను అడిగిన వెంటనే రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం నియోజకవర్గం 36 డివిజన్ లో హెల్త్ సెంటర్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించడం పట్ల ఖమ్మం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ A బ్లాక్ అద్యక్షుడు,
వైరా నియోజకవర్గ ఇన్చార్జి, ఖమ్మం నగరపాలక సంస్థ మాజీ కార్పొరేటర్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ట్రంకు రోడ్డు లోని అర్బన్ MRO ఆఫీస్ ప్రక్కన DEO ఆఫీస్ నందు ఖమ్మం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు బుధవారం మధ్యాహ్నం శంకుస్థాపన చేశారని హర్ష వ్యక్తం చేశారు. 15వ పంచవర్ష ప్రణాళిక నుంచి కోటి 43 లక్ష రూపాయలు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి మంజూరు చేశారని తిలక్ తెలిపారు.
ఖమ్మం నగరం త్రీ టౌన్ ఏరియాలోని నిరుపేద, మధ్యతరగతి ప్రజలు అర్బన్ హెల్త్ సెంటర్ నందు వైద్య సేవలు పొందచ్చని ఆయన తెలిపారు. ఇక నుంచి దూర ప్రాంతానికి వైద్య సేవ కోసం ప్రజలు వెళ్లవలసిన అవసరం లేకుండా కాంగ్రెస్ సర్కార్ మన ప్రాంతంలోనే అర్బన్ హెల్త్ సెంటర్ ను నిర్మిస్తుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు