మన జ్యోతి ప్రతినిధి మే 11 ఖమ్మం తెలంగాణ భవన్ మీడియా సమావేశం

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కొండబాల కోటేశ్వరరావు, జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్, డీసీసీబీ మాజీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణంలతో కలిసి శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు

ఖమ్మం తెలంగాణ భవన్ లో జరిగిన ఈ సమావేశంలో బీఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షులు పగడాల నాగరాజు, సీనియర్ నాయకులు బొమ్మెర రాంమూర్తి తదితర ప్రముఖులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర కామెంట్స్
👉 అధికార కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా విఫలమైంది
👉ఆ పార్టీ ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయింది
👉 తెలంగాణలో ప్రధాన సామాజిక వర్గాలకు ప్రభుత్వంలో ప్రాతినిథ్యం, ప్రాధాన్యత ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేసింది,చేస్తున్నది
👉 ముస్లిం, మున్నూరుకాపు, ముదిరాజ్, యాదవ,పద్మాశాలీ,లంబాడీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించలే
👉 ఎంపీ సీట్ల కేటాయింపులో మాదిగలను పట్టించుకోలే
👉 దీంతో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కాంగ్రెస్ పాలకులపై గుర్రుగా ఉన్నరు
👉రైతుబంధు ఇవ్వకపోవడం, పింఛన్లు 4వేలకు పెంచకపోవడం,కళ్యాణలక్ష్మీతో పాటు ఇస్తామన్న తులం బంగారం మాటే ఎత్తకపోవడం, గృహిణులకు రూ500 వంటగ్యాస్,రూ2,500 సాయం, నిరుద్యోగ భృతి 4వేలు ఊసే ఎత్తకపోవడం వంటి హామీలను పాలకులు విస్మరించారు
👉ఈ కారణాల వల్ల రైతన్నలు,మహిళలు, యువత కాంగ్రెస్ పార్టీ పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నరు
👉 మహానేత కేసీఆర్ గారి బస్సు యాత్రకు,రోడ్ షోలకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు
👉 కేసీఆర్ గారి 10ఏండ్ల పాలనను కాంగ్రెస్ 150రోజుల పనితీరును పోల్చి చూస్తున్న ప్రజలు బీఆర్ఎస్ పట్ల సానుకూలత పెంచుకుంటున్నరు
👉అనితర సాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10ఏండ్ల అనతికాలంలోనే గొప్పగా అభివృద్ధి చేసిన కేసీఆర్ గారి వైపు ప్రజలంతా చూస్తున్నరు
👉 కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తప్పుడు విధానాలను పార్లమెంట్ లోపల,బయట ఎండగట్టిన బీఆర్ఎస్ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నరు
👉 ఖమ్మం, మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థులు నామ నాగేశ్వరరావు,మాలోతు కవితలు ప్రచారంలో అందరి కంటే ముందున్నరు
👉వీరితో పాటు రాష్ట్రంలోని బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లేసి భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించవలసిందిగా ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనారిటీలను సవినయంగా కోరుతున్న

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు