Category: నల్లగొండ జిల్లా ఉమ్మడి

ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో అభయ హస్తం పథకం అమలు సన్నాహక సమావేశం జరిగింది..!! MNR గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమానికి నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు శ్రీ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గార్లు హాజరయ్యారు..!! సమావేశానికి హాజరైన ఉమ్మడి నల్లగొండ జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి మంత్రులు ప్రసంగించారు..!! డిసెంబర్ 28 వ తేదీ నుండి ప్రారంభించి జనవరి 6 వ తేదీ వరకు నిర్వహించనున్న అభయహస్తం కార్యక్రమాన్ని అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు..!!

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు