మూడోసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం

జులూరుపాడు 25 -03 -2023 🔶 మూడోసారి కూడా కేసీఆర్ నే సీఎం : నామ నాగేశ్వరరావు 🔶ఎన్నికలకు కార్యకర్తలంతా సంసిద్ధులై కదలాలి : నామ 🔶కార్యకర్తలే పార్టీకీ బలం, బలగం: నామ 🔶ప్రజా క్షేత్రంలో సత్తా చాటాలి : నామ…

బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం రఘునాధపాలెం మండలం సమిష్టి కృషి హ్యాట్రిక్ విజయం

బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజ‌యానికి కార్య‌క‌ర్త‌లు స‌మిష్టిగా కృషి చేయాలి.. పొలిటికల్ పవర్ న్యూస్ 9. ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు ▪️ప్ర‌భుత్వ అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళాలి. ▪️ప్ర‌జాప్ర‌తినిధులు, నాయకులు నిరంత‌రం ప్ర‌జ‌ల్లో ఉండాలి. ▪️నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సమన్వయంతో పని…

మతసామరస్యాన్ని కాపాడటంతో పాటు ముస్లిం సంక్షేమాన్ని పట్ల చిత్తశుద్ధితో ఉందని మంత్రి పువ్వాడ అన్నారు

మ‌త‌సామ‌రస్యాన్ని కాపాడ‌టంతో పాటు.. ముస్లీంల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, వివిధ సంక్షేమ పథకాలను అందిస్తూ పని చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభోత్సవం సందర్భంగా…

అకాల వర్షాలకి పంట నష్టం పై ముఖ్యమంత్రి కేసీఆర్ కి వినతి పత్రం తమ్మినేని వీరభద్రం

ముఖ్యమంత్రి కేసీఆర్ కు వినతి పత్రం అందజేస్తున్న తమ్మినేని వీరభద్రం నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 20 వేలు పరిహారం ఇవ్వాలి: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు 20వేల రూపాయలు నష్టపరిహారం…

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

కౌలు రైతుల్ని ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు డిమాండ్ ఇటీవల అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతుల పంట పొలాలను తెలుగుదేశం పార్టీ పోరాట ఫలితమే ఈరోజు ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చి నష్టపోయిన పంటలను…

అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్‌ భరోసా.. ఎకరానికి 10 వేలు సాయం.. ▪️మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారితో మీడియా సమావేశం. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు.…

అకాల వర్షాలకి పంట నష్టాన్ని స్వయానా పరిశీలించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా రాక

రేపు జిల్లాల్లో సీఎం పర్యటన.. పంటలను పరిశీలించనున్న కేసీఆర్‌ ఖమ్మం జిల్లాకు సీఎం రాక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. ఇటీవల…

చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో 19 శాఖల వారు ఏఎంసి చైర్మన్ శ్వేత ఏసిపి గణేష్ త్రీటౌన్ సిఐ సత్యనారాయణ ని ఘనంగా సన్మానించడం జరిగింది

20 మార్చి సాయంత్రం పొలిటికల్ పవర్ న్యూస్ 9 ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు ఏ యం సి ఛైర్ పర్సేన్ శ్వేత కు ,ఏ సి పి గణేష్,లకు ఘన సన్మానమునూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించినమార్కెట్ కమిటీ చైర్ పర్సన్…

ఆల్ ఇండియా బైతుల్ ఇమ్దాద్ ఆధ్వర్యంలో రంజాన్ కిట్టు పంపిణీ
ముఖ్య అతిథి ఏసిపి పి.వి.గణేష్
ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు మదర్స -ఎ- ఇస్లామియా దారుల్ ఉలూమ్ లో ఆల్ ఇండియా బైతుల్ ఇమ్దాద్ ఆధ్వర్యంలో రంజాన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పేద ముస్లింలకు ఉపవాసాలు ఉండే సమయంలో ఉపవాస దీక్షలకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా నెలకు సరిపడ సరుకులు , బియ్యం పంపిణీ చేసారు . ఈ కార్యక్రమానికి నగర ఏసిపి పి.వి. గణేష్ ముఖ్య అతిథిగా పాల్గొని నిత్యవసర సరుకులు పేద ముస్లింలకు అందజేసారు . సంస్థ నిర్వహకులు ఫ్రీ అంబులెన్స్ , ఫ్రీ నిత్యావసరాలు , చదువుకు , పెళ్లికి ఇలా సమాజంలో ఉన్న వారికి అన్ని విధాల తోడ్పాటునివ్వడాన్ని చూసి చాలా సంతోషంగా ఉందన్నారు . పండుగ అంటే అందరు జరుపుకొనేదని అందరి కోసం కొందరు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది సమాజానికి మంచి సందేశం ఇస్తుందన్నారు . సుమారుగా నిరుపేద ముస్లింలకు వంద మందికి అందజేశారు . ఈ కార్యక్రమంలో అభయ హస్పిటల్ సిఈఓ కరీం , మౌలానా సాదతుల్లాహ్ , ఎండి. మునవ్వర్ (సేఫ్ బాగ్స్ ) , హాఫిజ్ ఫజల్ , హాఫిజ్ నజీర్ , ముఫ్టీ మహబూబ్ అలీ , ముఫ్టీ సల్మాన్ ఖాన్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు .

వన్ టౌన్ ఆత్మీయ సమ్మేళన
ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ , పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ గారి ఆదేశాల మేరకు ఖమ్మం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి నేతృత్వంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఖమ్మం కార్పోరేషన్ లోని 16 డివిజన్లతో సీక్వెల్ ఫంక్షన్ హాల్ నందు వన్ టౌన్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ సందర్భంగా BRS జిల్లా ఇంఛార్జి శేరి సుభాష్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ, BRS జిల్లా అధ్యక్షులు తాత మధు గారు, ఎంపి నామా నాగేశ్వరరావు గారు, జెడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారు పాల్గొని మాట్లాడారు.
అనంతరం మంత్రి పువ్వాడ మాట్లాడుతూ..
రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు
క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి, పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపి మరింత చైతన్య పరిచేందుకు పార్టీ అధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహింస్తున్నమని పేర్కొన్నారు.
నాకు BRS పార్టీ ద్వారా మీలాంటి వేల మంది కుటుంబాన్ని అందించిన ముఖ్యమంత్రి కేసీఅర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని, అన్నిటి కంటే ముఖ్యంగా నియోజకవర్గం మొత్తం ఇలానే ప్రతి కార్యకర్త పేరు పెట్టి పిలిచే జ్ఞాపకశక్తిని నాకు జీవితాంతం దేవుడు ఇలాగే ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
పార్టీకి కార్యకర్తలే శ్రీరామ రక్ష అని ఆత్మీయ సమ్మేళనాలు నాయకులు, కార్యకర్తల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేస్తాయన్నారు.
ఖమ్మం నా ఇల్లు.. ప్రజలు నా కుటుంబ సభ్యులు అని వారికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రభుత్వం నుండి ప్రతి సంక్షేమం, అభివృధ్ధిని వారికి చేరువ చేయాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు. ఇప్పటి వరకు ఖమ్మం నియోజకవర్గంలో ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని ప్రతి ఇంటికి మీ ద్వారా చేర్చగలిగామని వివరించారు.
దళిత బందు పథకాన్ని క్షేత్ర స్థాయిలో అందరికీ అందిస్తామని, గడచిన రెండేళ్లలో నియోజకవర్గంలోనే 2500 ఇళ్లు ఇచ్చామని, ఇంకా మరిన్ని ఇస్తామన్నారు.
నన్ను ఖమ్మం ప్రజలు అందరి వాడుగా చూసుకుంటారని, మైనారిటీలు ప్రేమతో అజయ్ ఖాన్ గా పిలుచుకుంటారు క్రైస్తవులు ప్రభువు బిడ్డగా ఆత్మీయంగా చూసుకుంటారని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని అందుకు కార్యకర్తలే ప్రధాన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
గత ఖమ్మంను నేటి ఖమ్మంతో పోల్చి చూడండి, ఒకప్పుడు ఖమ్మం నగరంలో త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతూ నిత్యం రోడ్ల మీద త్రాగునీటి ట్యాంకర్ లతో గల గల నడిచిన నాటి రోజులు ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు.
నేడు ఎక్కడైనా వాటర్ ట్యాంకర్ లు కనబడుతున్నాయా అని, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి శుద్ధమైన త్రాగునీరు అందిస్తున్నామని నిజమా కాదా ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఖమ్మంలో కులాలు, మతాల మధ్య విద్వేషాలు రగిల్చి చిచ్చు పెట్టాలని ప్రయత్నాలు చేసేందుకు కొందరు వస్తారని అన్నారు. జాతీయ పార్టీలు వాటికున్న బుజులు దులుపుకుని రోడ్లు ఎక్కుతున్నారని ప్రజలు తస్మాత్ జాగ్రత్త అని సూచించారు.
నాకు ఇక్కడే ఓటు ఉంది, ఇక్కడే చదివినా.. ఇక్కడే ఉన్నా, ఇక్కడే తిరిగిన, నా బతుకు ఇక్కడే.. నా చావు కూడా ఇక్కడే అని స్పష్టం చేశారు.
ఇక్కడ ఓటు లేనోల్లు కూడా దాబులకు మాట్లాడుతారని, ఎం అర్హత ఉందో తెలియక కేసీఅర్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం అని తాటాకు చప్పుళ్ళు చేస్తు, అవాక్కులు చవాక్కులు పెలుతున్నారని అన్నారు.
నీ ఊడత ఉపుడుకి భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరని, అక్కడ ఉన్నది కేసీఅర్ గారు అని అది గుర్తుంచుకుని ప్రవర్తిస్తే మంచిదని హితువు పలికారు.

You missed