సిఎం కెసిఆర్ పాల‌న‌లోనే మ‌హిళ‌ల‌కు మ‌హ‌ర్ద‌శ‌..
▪️మ‌హిళ‌ల సాధికార‌త కోస‌మే అనేక ప‌థ‌కాలు.
▪️మ‌హిళా దినోత్స‌వ కానుక‌గా రాష్ట్రంలో ఆరోగ్య మ‌హిళ ప‌థ‌కం.. వడ్డీ రహిత రుణాలు..
▪️ మహిళా అభివృద్ధితోనే దేశ ప్ర‌గ‌తి.
▪️దేశ‌లో ఎక్క‌డా లేని విధంగా డ్వాక్రా సంఘాల బ‌లోపేతం.. స్త్రీ నిధి ద్వారా 18వేల కోట్ల రుణాలు.
సిఎం కెసిఆర్ పాల‌న‌లోనే మ‌హిళ‌ల‌కు మ‌హ‌ర్ద‌శ వ‌చ్చింది. మ‌హిళ‌ల సాధికార‌త కోసం సిఎం కెసిఆర్ గారు అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నారని, మ‌హిళా దినోత్స‌వ కానుక‌గా రాష్ట్రంలో మ‌హిళా ఆరోగ్య ప‌థ‌కాన్ని తీసుకొచ్చారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఖమ్మం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసిన మహిళలకు తినిపించారు.
బిలీఫ్ హాస్పిటల్స్ అధినేత మేడంపూడి రమాజ్యోతి అధ్వర్యంలో నాగార్జున ఫంక్షన్ హాల్ నందు జరిగిన మహిళా దినోత్సవంలో పాల్గోన్నారు.
భక్త రామదాసు కళాక్షేత్రంలో బ్యాంక్ లింకేజ్ ద్వారా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రహిత రుణాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మ‌హిళ‌ల అభివృద్ధితోనే దేశ ప్ర‌గ‌తి, పురోగ‌తి జ‌రుగుతుంది. దేశ‌లో ఎక్క‌డా లేని విధంగా డ్వాక్రా సంఘాల బ‌లోపేతం మ‌న రాష్ట్రంలోనే జ‌రిగిందన్నారు. స్త్రీ నిధి ద్వారా 18వేల కోట్ల రుణాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.
అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మహిళల ఆరోగ్యం కోసం అరోగ్య మహిళ, వడ్డీ రహిత రుణాలను అందజేశారు. ఈ సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో పురుషుడి కంటే ధీటుగా అన్ని రంగాల్లో విస్తృతంగా రాణిస్తున్నారని, మహిళలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఅర్ గారు మహిళలకు అన్ని రంగాల్లో ఉన్నత స్థానం కల్పించారని అన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలను విడుదల చేస్తూ ఒక గొప్ప కానుక ఇచ్చిందని వారు అన్నారు.
రూ.750 కోట్ల రూపాయల భారీ నిధులను ఆడబిడ్డల కోసం విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ప్రభుత్వానికి మహిళల తరుపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఈ నిధుల‌లో 250 కోట్ల రూపాయ‌లు ప‌ట్ట‌ణ ప్రాంతాల మ‌హిళ‌ల కోసం కాగా, 500 కోట్లు గ్రామీణ మ‌హిళ‌ల కోస‌మ‌ని మంత్రి తెలిపారు. ఈ మొత్తం 750 కోట్ల రూపాయల నిధులతో తెలంగాణ రాష్ట్రంలో అటు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల‌లో ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలకు భారీ ఎత్తున లబ్ధి చేకూరుతుందని అన్నారు.
ఇప్పటిదాకా గత ప్రభుత్వాలు స్వయం సహాయక సంఘాలకు 10 ఏండ్లలో 21 వేల 978 కోట్లు రుణాలు ఇస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు 8 ఏండ్ల‌ల్లో రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల ద్వారా 66 వేల 624 కోట్ల రూపాయలను మహిళా సంఘాలకు రుణాలుగా ఇప్పించడం జరిగిందని మంత్రి వివ‌రించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ప్రభుత్వం ఇప్పటివరకు వడ్డీలేని రుణాలుగా అర్హత కలిగిన 3 లక్షల 85 వేల 82 సంఘాలకు 2 వేల 561 కోట్ల 77 లక్షలు విడుదల చేసింది. దీని ద్వారా 46 లక్షల 20 వేల 984 సంఘ సభ్యులకు లాభం చేకూరింది. తెలంగాణ ప్రభుత్వం వడ్డీ లేని రుణాల నిధులను పెద్ద ఎత్తున విడుదల చేయడంతో సిఎం కెసిఆర్ గారికి, ప్రభుత్వానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రాల్లోని అసెంబ్లీ, కౌన్సిల్ వంటి చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని అప్పటి ఎంపీగా, ప్రస్తుత ఎమ్మెల్సీగా, జాగృతి అధ్యక్షురాలుగా కల్వకుంట్ల కవిత అలుపెరగకుండా గత తొమ్మిదేళ్ళ కాలం నుంచి పోరాటం చేస్తున్నారని అన్నారు.
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తీర్మానాన్ని ఆమోదించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి స్వయంగా అందజేశారని పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్స్ కోసం తమ పార్టీ ఎంపీలతో సహా కవిత, తాను కూడా అనేక సార్లు పార్లమెంట్ లో ప్రస్తావించామని తెలిపారు.
ఈనెల 10వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో కవిత చేపట్టనున్న మహిళా రిజర్వేషన్ల దీక్షకు దేశంలోని మహిళలు సంపూర్ణ మద్దతు పలకాలని పిలుపునిచ్చారు.
మహిళా రిజర్వేషన్లు అమలు అయితే దాదాపు 180 ఎంపీ స్థానాలు మహిళలకు దక్కుతాయని, అలాగే ఆయా రాష్ట్రాల్లోని అసెంబ్లీ, కౌన్సిల్ లలో కూడా రిజర్వేషన్లు లభిస్తాయని పేర్కొన్నారు.
రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని, అయితే లోక్ సభలో మాత్రం ఈ బిల్లు ఆమోదం పొందలేదు అని, ప్రధాని నరేంద్ర మోడీ తలుచుకుంటే ఇది సాధ్యం అవుతుందని, కానీ బిజెపికి చిత్తశుద్ధి లేదని వారు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మహిళా సంఘాలకు రుణాలను అందజేశారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు, పలు రంగాల్లో ఉన్నత స్థానంలో ఉన్న పలువురుకి మహిళలకు శాలువాతో సత్కరించారు.
ఎమ్మెల్సీ తాతా మధు, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార,ZP చైర్మన్ లింగాల కమల్ రాజ్, జిల్లా కలెక్టర్ VP గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్, సుడా చైర్మన్ విజయ్, AMC చైర్మన్ శ్వేత, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, DM &HO మాలతి, ZPTC ప్రియాంక, వివిధ శాఖ అధికారులు ఉన్నారు.


ఆరోగ్య మహిళ.. ఆడ బిడ్డకు వరం..
▪️మహిళా శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వం తెచ్చిన సరికొత్త పథకం.
▪️ఆరోగ్య మహిళలో ప్రతి మంగళవారం 57 రకాల ఉచిత పరీక్షలు.
▪️జిల్లా ఆసుపత్రిలో 65 పడకల ప్రత్యేక మహిళా వార్డు, రేడియాలజీ హబ్‌.
▪️ప్రారంబించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు.
అరోగ్య మహిళ పథకం మహిళలకు వరంలాంటిదని, మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్భంగా మరో గొప్ప వరాన్ని అందించిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఆరోగ్య మహిళ అనే మంచి కార్యక్రమాన్ని రూపొందించిందని మంత్రి అన్నారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మహిళలa ఆరోగ్యంకై మెరుగైన పరీక్షల కోసం రేడియాలజీ యూనిట్‌, Mammogram ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా ప్రతి మంగళవారం మహిళలకు 57 రకాల పరీక్షలు ఉచితంగా చేసి మందులు ఉచితంగా ఇస్తారన్నారు. అవసరమైతే ఇతర దవాఖానలకు రెఫర్‌ చేస్తారన్నారు.
పరీక్షల అనంతరం ఆరోగ్య మహిళ యాప్‌లో వివరాలు నమోదు చేసి ప్రతి పేషంట్‌కు తన ఆరోగ్య పరిస్థితి, వైద్యం వివరాలతో కూడిన కేస్‌ షీట్‌ అందజేసి పరీక్షలు పూర్తయ్యాక మెరుగైన వైద్యసేవలు అవసరమని భావిస్తే ఇతర దవాఖానలకు రిఫర్‌ చేస్ అవకాశం ఉందన్నారు. అక్కడ వారికి మెరుగైన వైద్య సాయం అందిస్తారన్నారు.
మెరుగైన సేవలతో విశేష ఆదరణ
ప్రభుత్వ దవాఖానలు సరికొత్తగా మారాయని, స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌కు దీటుగా వసతులు కల్పించింది. మెరుగైన వైద్యసేవలు అందిస్తుండడం, నాణ్యమైన మందులు అందిస్తుండడంతోనే ప్రజాదరణ పెరుగుతున్నదన్నారు.
అనతికాలంలోనే రోగుల సంఖ్య రెట్టింపయిందని, ఈ క్రమంలోనే అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు.
DM &HO మాలతి మాట్లాడుతూ.. అరోగ్య మహిళలో వీటిలో 57 రకాల పరీక్షలు ఉచితం
మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించిందని, ఆయా రుగ్మతలను గుర్తించేందుకు ప్రతి మంగళవారం వైద్యపరీక్షలు నిర్వహించడానికి కసరత్తు చేస్తుందని, దీని కోసమే ‘ఆరోగ్య మహిళ’అనే పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు.
ఇందులో 57 రకాల పరీక్షలు ఉచితంగా చేసి, మందులు, అవసరమైన వారికి చికిత్స కూడా చేయనున్నామని, ప్రధానంగా డయాగ్నోస్టిక్స్‌, సూక్ష్మపోషక లోపాలు, పీసీవోఎస్‌, కుటుంబనియంత్రణ, రుతు సమస్యలు, లైంగిక వ్యాధులు, క్యాన్సర్‌ స్క్రీనింగ్‌, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు, మెనోపాజ్‌ నిర్వహణ, శరీర బరువుకు సంబంధించిన పరీక్షలు చేసి 24 గంటల్లోనే రిపోర్ట్‌లు అందిస్తారన్నారు.
మహిళలకు షుగర్‌, బీపీ, రక్తహీనత వంటి వాటికి సాధారణ పరీక్షలతో పాటు లక్షణాల మేరకు పలు రకాల వైద్యపరీక్షలు నిర్వహించి ఇంకా వెయిట్‌ మేనేజ్‌మెంట్‌, సెక్స్‌వల్‌ ట్రాన్స్‌మిటెడ్‌ మే నేజ్‌మెంట్‌, ఇన్‌ఫర్టిలిటీ మేనేజ్‌మెంట్‌, మోనోపాజ్‌, థైరా యిడ్‌, విటమిన్‌డీ-3, ఈ-12 డెఫిసియన్సి వంటి వాటికి దవాఖానల్లో స్క్రీనింగ్‌ చేస్తారన్నారు.
దాంతో పాటు యూరినరీ ట్రాక్‌ ఇన్‌ఫెక్షన్‌, పెల్విక్‌ ఇన్‌ప్లమేటరీ వ్యాధులకు కూడా పరీక్షలు చేయనున్నారని, అసవరమైన వారిని రెఫరల్‌ ఆసుపత్రులకు సిఫార్సు చేస్తారని, హర్మోన్‌ రీప్లేస్‌మెంట్‌, థెరపీ మెడికేషన్‌, కౌన్సెలింగ్‌ ఇస్తారు. బరువుకు సంబంధించి యోగ, వ్యాయామంపై అవగాహన కల్పిస్తారన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగించుకోవాలన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఆమె’… తల్లిగా లాలిస్తుంది, చెల్లిగా తోడుంటుంది… భార్యగా బాగోగులు చూస్తూ.. దాసిలా పనిచేస్తుంది. కుటుంబ భారాన్ని మోస్తూ… సర్వం త్యాగం చేస్తుంది. అంతటి గొప్ప మహిళకు మనసారా ధన్యవాదాలు కనులు తెరిచిన క్షణం నుంచి.. బంధం కోసం బాధ్యత కోసం.. కుటుంబం…

Pratipada Vidyarthi vannatha chadu qawwali
ప్రతి పేదవాడు ఉన్నత విద్యావంతుడు కావాలి..
▪️సకల వసతులతో ప్రభుత్వ పాఠశాలలు.. ఉన్నత విలువలతో విద్యా ప్రమాణాలు..
▪️ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం.
▪️మన బస్తి మన బడి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నగరంలో రూ.57.38 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంబించిన మంత్రి పువ్వాడ.
పాఠశాలను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన పథకం మన ఊరు-మన బడి/మన బస్తి-మన బడి అని అందులో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలలో అన్ని మౌళిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయడం జరిగిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.
మన బస్తి – మన బడి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నగరం 53వ డివిజన్ NSP క్యాంప్ లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ. 57.38 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి పువ్వాడ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలో చదువుతోన్న విద్యార్థులకు నాణ్యమైన విద్య, నమోదు, హాజరుతో పాటు వారు తమ పాఠశాల విద్యను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించేందుకు వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రతి పేదవాడి ఉన్నత విద్యను ఉచితంగా అభ్యసించి జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ప్రభుత్వం సంకల్పించిందని పేర్కొన్నారు. ఖమ్మం నగరంలో ఇంకా 16 ప్రభుత్వ పాఠశాలలో పనులు కొనసాగుతున్నాయని అతి త్వరలో వాటిని పూర్తి చేసి వినియోగంలోకి తెస్తామని హామి ఇచ్చారు.
ఇప్పటికే నిర్దేశించిన పాఠశాలలు పూర్తి అయ్యాయని, అందులో విద్యార్థులు అద్భుతంగా విద్యను అందుకుంటున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నారని, ఇంగ్లీష్ విద్యను అందించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
ఇటీవలే కాలంలో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ కొరకు తనకు విజ్ఞప్తులు పెరుగుతున్నాయని, ఆయా తల్లిదండ్రులు తమ పిల్లలకు పాఠశాలలో అడ్మిషన్ కోసం అడిగినపుడు మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అని అన్నారు.
దశల వారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోందని, దీనికోసమే మన ఊరు-మన బడి/మన బస్తి-మన బడి పథకాన్ని తీసుకొచ్చి అమలు చేస్తోందన్నారు.
దశల వారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునీకరణ, స్కూళ్లలో 12 రకాల మౌలిక సదుపాయల కల్పనకు పటిష్ట చర్యలు చేపట్టామని, గ్రామీణ ప్రాంతాలలో ఈ స్కీమ్‌ను మన ఊరు-మన బడి పేరుతో అమలు చేస్తుండగా.. పట్టణ ప్రాంతాలలో మన బస్తి-మన బడి పేరుతో అమలు చేస్తున్నామన్నారు.
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకే తెలంగాణ ప్రభుత్వం విద్యావ్యవస్థ పై అత్యధికంగా నిధులు వెచ్చించిందన్నారు. తొలుత ప్రభుత్వ, స్థానిక సంస్థలకు చెందిన పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని, ఆయా పాఠశాలలో నీటి సౌకర్యంతో పాటు టాయిలెట్లు, విద్యుద్దీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి సరిపడే ఫర్నీచర్ అందించడం, పాఠశాలలు మొత్తం నవీకరించడం, మరమ్మత్తులు చేయడం, కిచెన్లు ఏర్పాటు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్ రూ‌లు ఏర్పాటు చేయడం, డిజిటల్ విద్య వంటి వాటిని అమలు చేస్తోందన్నారు.
జిల్లా కలెక్టర్ VP గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, మేయర్ పునుకొల్లు నీరజ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, కార్పొరేటర్ పగడాల శ్రీవిద్యా నాగరాజ్, సుడా చైర్మన్ విజయ్, DEO సోమశేఖర్ శర్మ, RJC కృష్ణా తదితరులు ఉన్నారు.

సమాజ సేవలో గ్రామీణ వైద్యులు ముందంజ .
పాలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి
ఖమ్మం నగరంలో ఆదివారం బైపాస్ రోడ్ కృష్ణ ఫంక్షన్ హాల్ లో జరిగిన గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం 20వ మహాసభకు ముఖ్యఅతిథిగా పాలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడరు . శభాష్ గ్రామీణ వైద్యులు , సమాజ సేవలో గ్రామీణ వైద్యులు ముందంజ లో ఉన్నారని , సమాజంలో గ్రామీణ వైద్యుల సేవలు మరువలేనివని అన్నారు . రోగాన్ని బట్టి డాక్టర్ దగ్గరికి తీసుకొని పోయి మెరుగైన వైద్యాన్ని సమయానికి అందెల చూస్తున్నారు . గ్రామీణ వైద్యులు అంటే ప్రాణ దాతలని వారి వల్ల కొన్ని వేల కుటుంబాలు అనాధలు కాకుండా నిలబడుతున్నాయని కొనియాడారు . సంఘం కార్యాలయానికి తమ వంతుగా నగదు రూపంలో గానీ స్థలం రూపంలో గానీ కొంత సహాయం చేస్తానని హామీ ఇచ్చారు . అలాగే తమ సమస్యలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చోర్వాత ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు . వైద్యం అంతే వ్యాపారం కాదని సేవా భావంతో కలిగి ఉండాలని సూచించారు . ఈ సందర్భంగా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ గ్రామీణ వైద్యులను ప్రభుత్వం గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని , వారు ఎవరికి వ్యతిరేకం కాదని , ఆగిపోయిన శిక్షణా తరగతులను మళ్లీ పునర్దించి జీవో ప్రకారం అర్హులైన వారికి సర్టిఫికెట్ లను అందజేసి నకిలీ అని అవమానించే వారి నుండి రక్షించాలని కోరారు . అనంతరం వచ్చిన అతిథులను మరియు వివిధ మండలాల అధ్యక్షులను , కార్యదర్శులను ఘనంగా శాలవలతో సత్కరించారు . ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు , ఖమ్మం జిల్లా అధ్యక్షులు పిట్టల నాగేశ్వరావు వహించి మాట్లాడారు . వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో గ్రామీణ వైద్యులందరికీ శిక్షణ ఇప్పించి గుర్తింపు ఇవ్వాలని ప్రతిపాదన తీసుకొచ్చారని , ఆయన చనిపోవడంతో ఆగిపోయిందని , ఆ తర్వాతకి తెలంగాణ ఉద్యమం మొదలైందని ఈ తెలంగాణ ఉద్యమంలో గ్రామీణ వైద్యుల్లంత చాలా చురుకుగా క్రియాశీలకంగా పనిచేశారని , రాష్ట్ర రోకలో , సకల జన సమ్మెలో పాల్గొన్నారని అన్నారు . ఆనాడు కేసీఆర్ ఏదైతే ఆగిపోయిందో గ్రామీణ వైద్యులకు మళ్లీ శిక్షణను ఇప్పించి సర్టిఫికెట్లు జారీ చేపిస్తానని అలాగే వైద్య వృత్తిలో కొన్నిటిని క్రియాశీలకం చేస్తానని ఆనాడు మాటిచ్చారని అది ఇంతవరకు చేయడం లేదని , క్రియా రూపంలో దాచలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు . ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దోరేపల్లి శ్వేత , జెడ్పిటిసి వరప్రసాద్ , రూరల్ ఎంపీపీ బెల్లం ఉమా – వేణు , గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చొప్పరి శంకర్ ముదిరాజ్ , రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ , ఖమ్మం జిల్లా కమిటీ , జిల్లా కార్యదర్శి అనంతరపు వెంకటాచారి మరియు సంకల్ప హాస్పిటల్ డాక్టర్ రాకేష్ , dr.చైతన్య , క్యాన్సర్ నిపుణులు dr. వంశీ , పిల్లల డాక్టర్స్ dr. గౌతం , dr. రాజ్ కుమార్ , ఎందుక్రైనాలోజిస్ట్ dr. కావ్య , dr. రాజశేఖర్ , dr.ప్రదీప్ , జిల్లా ఉపాధ్యక్షులు N మణికుమార్ , M.సుదర్శన్ , P.వెంకటరామయ్య లు పాల్గొన్నారు . ఉమ్మడి జిల్లాల నలుమూలల నుండి విచ్చేసిన గ్రామీణ వైద్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు .

★రఘునాథపాలెం మండలంలో పొలాలకు రాజభాటలు వేసిన మంత్రి పువ్వాడ
◆2కోట్ల నిధులతో శరవేగంగా కొనసాగుతున్న డొంక రోడ్ల నిర్మాణ పనులు
◆హర్షిస్తున్న రైతన్నలు
ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధిని మంత్రి అజయ్ పరుగులు పెట్టిస్తున్నాడు అనడంలో ఎలాంటి సందేహాలు లేవు. రఘునాథపాలెం మండలంలో రైతులు పొలాలు వెళ్లడానికి ఇబ్బందులు లేకుండా రోడ్ల రూపురేఖలు మారాయి. మండల వ్యాప్తంగా ప్రధాన రోడ్లు అన్ని ఇప్పటికే సుందరంగా తయారయ్యాయి. 10 సంవత్సరాల క్రితం ఖమ్మం నియోజకవర్గంను చూసి ఇప్పుడు చూసినవాళ్లు అబ్బురపడుతున్నారు. గతంలో కొంత అభివృద్ధి జరిగినా ఇప్పుడు వందల కోట్లతో పనులు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే రఘునాథపాలెం మండలంలో రైతులు పొలాలకు వెళ్లడానికి ఇబ్బందులు లేకుండా రెండు కోట్ల ప్రత్యేక నిధులతో డొంక రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పూర్తి కావచ్చాయి. ఈ సందర్భంగా మండల ప్రజానీకం, రైతులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

ఆదివారం వేళ రజబ్ అలీ పార్కు జనంతో కళ కళ
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి ప్రత్యేక దృష్టితో నాడు దుర్గంధం వెదజల్లే మురికికూపలు, నేడు ఆహ్లాదం పంచే ఉద్యానవనలు కావడంతో 46వ డివిజన్లోని రజబ్ అలీ పార్క్ ఆదివారం జనాలతో కిటకిటలాడింది.నాడు మురికికూపంగా ఉన్న ప్రాంతం నేడు ఆహ్లాదంతో పార్కులు సందడిగా ఉండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వైన్ షాప్ ల దగ్గర జాతర్ల పర్మనెంట్ రూమ్స్ నిబంధనలు ఉల్లంఘన

*జాతర లా పెర్మనెంట్ యదేచ్ఛగా విక్రయాలు *ఉల్లంఘిలా మత్తు.. జాతర్ల పర్మినెంట్.. మద్యం షాపుల వద్ద నిబంధనలకు తూట్లు… మద్యం షాపులలో సరుకు కొని తాగేసి వెళ్లిపోయేందుకు ఉన్న పర్మనెంట్ రూములతో పరేషాన్ పడేసింది. పరిమితికి మించి విస్తరణలో రూములు లోపల…

సకల సౌకర్యాలతో కార్పొరేట్ తీటుగా ప్రభుత్వ విద్య

పొలిటికల్ పవర్ న్యూస్ 9 ప్రతినిధి వెంపటి నాయుడు సకల సౌకర్యాలతో కార్పొరేట్ కి ధీటుగా ప్రభుత్వ విద్యా.. ▪️విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు ఆధునీకరణ.. నాణ్యమైన విద్య. ▪️ రూ.16.92 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన…

ఫిబ్రవరి 27 28 లో మాదిగ హక్కుల దండోరా మహాసభలు ఎస్ఆర్ కన్వర్షన్ లో ఏర్పాటు చేయడమైనది

ఫిబ్రవరి 27 28 లో మాదిగ హక్కుల దండోరా మహాసభలు పొలిటికల్ పవర్ న్యూస్ 9 .ఖమ్మం ప్రతినిధి వెంపటి నాయుడు.. ఫిబ్రవరి 27, 28న మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర మహాసభలు— పెరిగిన జనాభా దామాషా ప్రకారం ఎస్సీల రిజర్వేషన్లు…

You missed