పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం …

తీర్ధాల జాతరకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు: పోలీస్ కమిషనర్

మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన్నట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు.

శనివారం ఖమ్మం రూరల్ మండలంలోని తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయాన్ని పోలీస్ కమిషనర్ సందర్శించారు.
జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుడా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు.
నిర్వహుకులు ఆలయ స్వాగత ద్వారం మొదలుకొని గర్భాలయం వరకు క్యూలైన్లు, చలువ పందిళ్లు, పరిసరాలు తిరిగి పరిశీలించారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు, పార్కింగ్, ఆర్టీసీ బస్ స్టాప్, తదితర ప్రాంతాల దగ్గర బారికేట్ల ఏర్పాటు పరిశీలించి తగిన సూచనలు చేశారు. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. స్నానపు ఘాట్ , ఇతర ప్రాంతాలలో నిరంతర విద్యుత్ కోసం ట్రాన్స్‌ఫార్మర్లు, జనరేటర్లు, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండేవిధంగా అధికారులతో సమన్వయం చేసుకొవాలని సూచించారు. భక్తుల వాహనాల పార్కింగ్ కోసం కేటాయించిన స్ధలంలో వాహనాలు నిలిపే విధంగా చర్యలు తీసుకొవాలన్నారు.

కార్యక్రమంలో అడిషనల్ డిసిపి (L&0) సుభాష్ చంద్రబోస్, రూరల్ ఏసీపీ భస్వారెడ్డి, ట్రాఫిక్ ఏసిపి రామోజీ రమేష్, ఎస్బి ఎసిపి ప్రసన్నకుమార్ రూరల్ ఎమ్మార్వో సుమ, తీర్థాల సర్పంచ్ బాలు, రూరల్ సిఐ శ్రీనివాస్, ఎస్సై రవి పాల్గొన్నారు. పి ఆర్ వో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు