గంగపుత్ర (బెస్త) సంఘం జిల్లా కమిటీ నియామకం

ఖమ్మం జిల్లా గంగపుత్ర బెస్త సంఘం అధ్యక్షునిగా కన్నం ప్రసన్న కృష్ణ, ప్రధాన కార్యదర్శి గా దేశ బోయిన మంగారావు, కోశాధికారిగా పెద్దపల్లి సుధాకర్ లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు దేశబోయిన తిరుపతయ్య, మైసా పాపారావు, పెద్దపల్లి సోమయ్యలు తెలిపారు. అనంతరం వారితో ప్రమాణస్వీకారం చేయించారు. తర్వాత జిల్లా అధ్యక్షులు జిల్లా నూతన కమిటీని ప్రకటించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానిక ఖమ్మం నగరంలోని అశోక ఫంక్షన్ హాల్ నందు జిల్లా గంగపుత్ర సంఘం సమావేశం జరిగింది.
నూతన కమిటీని పలువురు నాయకులు అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కన్నం ప్రసన్న కృష్ణ మాట్లాడుతూ గంగపుత్రులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఐకమత్యంగా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు కోరారు. చేపల వృత్తే జీవనాధారంగా బతుకుతున్న మత్స్యకారులైన గంగపుత్రులకు ప్రభుత్వం అన్ని విధాలా భరోసా అందించాలని వారు కోరారు. చెరువులపై హక్కు గంగపుత్రులకి ఉంటుందని స్పష్టం చేశారు.

గంగపుత్ర సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా చింతల మల్లేశం, గుడిబోయిన దర్గయ్య, పెద్దపల్లి సోమయ్య, వడ్డేబోయిన వెంకన్న, మైస శంకర్, భైరి కొమ్మాలు, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా చేతి కృష్ణ, కీర్తి శ్రీనివాస్, సింగు శ్రీనివాస్, పిల్లి సుదర్శన్, గుండా మల్లయ్య, లక్కం బక్కయ్య,
సంయుక్త కార్యదర్శులుగా కందరబోయిన కొండలరావు, జిరిపురపు అంజయ్య, పెద్దపల్లి దుర్గేష్, వడ్డేబోయిన బిక్షపతి, కందరబోయిన రామచంద్రయ్య, భూతం సత్యనారాయణ,
ప్రచార కార్యదర్శులుగా అంబటి మట్టయ్య, కుడుముల సత్యనారాయణ, నరుగుల మురళీకృష్ణ, దేశబోయిన నాగేశ్వరరావు, దేశ బోయిన శ్రీనివాసరావు, కంభం శేషయ్య మరియు గౌరవ సలహాదారులు గా పాకాల ఉపేందర్ దేశ బోయిన తిరుపతయ్య చెరుకు వెంకటేశ్వర్లు పిల్లి బయన్న లను నియమించారు.

అదేవిధంగా జిల్లా గంగపుత్ర యూత్ కమిటీ అధ్యక్షుడిగా చంద్రగిరి వేణు, ఉపాధ్యక్షులుగా చింతల వెంకన్న, అంబటి రఘుబాబు, ప్రధాన కార్యదర్శిగా దేశబోయిన సురేష్, సంయుక్త కార్యదర్శులుగా సింగారపు సాయి, పూస కిరణ్ ప్రచార కార్యదర్శిగా జీజుల రోహిత్, పెద్దపల్లి శ్రావణ్, మరియు కోశాధికారిగా మోసం యుగంధర్ లను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు కన్నం ప్రసన్న కృష్ణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన గంగపుత్ర సంఘం నాయకులు, యువకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు