ది.17.04.2023
పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం …

మహిళలకు భరోసా ఉమెన్స్ హెల్ప్ డెస్క్: పోలీస్ కమిషనర్

మహిళకు భరోసా కల్పించేందుకు ఉమెన్స్ హెల్ప్ డెస్క్ మరింత దోహదపడుతుందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు.

అన్ని పోలీసు స్టేషన్లలో మహిళలు స్వేచ్చగా నిర్భయంగా స్నేహపూర్వకంగా చేరుకోగలిగేలా చేయడంపై దృష్టి పెట్టిన పోలీస్ శాఖ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్లలో మహిళ సహాయ కేంద్రాలకు ఏర్పాటుకు శ్రీకారం చుట్టి అమలు చేస్తుంది.
అందులో భాగంగా ఈరోజు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉమెన్స్ హెల్ప్ డెస్క్ ను పోలీస్ కమిషనర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ …
పోలీసులంటే అపోహలు పోగొట్టి ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో మహిళ సిబ్బందితో కూడిన మహిళా హెల్ప్‌ డెస్క్‌ల ఏర్పాటుకు చేసి మహిళల పట్ల సున్నితంగా ఉండటానికి, స్నేహపూర్వకంగా ఎలా వ్యవహరించాలో కిందిస్థాయి సిబ్బందికి ఇచ్చిన శిక్షణలో నిర్దేశించామని అన్నారు. మహిళలను గౌరవంగా సంబోధించే వాతావరణం కల్పిస్తూ .. తద్వారా మహిళలు తమ సమస్యను నిర్భయంగా చెప్పడానికి, న్యాయ సహాయం, కౌన్సెలింగ్, ఆశ్రయం, పునరావాసం సులభతరం చేయడానికి జిల్లా వ్యాప్తంగా 26 పోలీస్‌ స్టేషన్లలో వీటిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బాధితులకు అండగా నిలిచి…అవసరమైన అన్ని సేవలు అందిస్తునమన్నారు.

కార్యక్రమంలో ట్రైనీ ఐపిఎస్ అధికారి అవినాష్ కుమార్ , ఏవో అక్తరునీసాబేగం , సిఐ తుమ్మ గోపి, భరోసా కేంద్రం కో-ఆర్డినేటర్ రాజకుమారి పాల్గొన్నారు. పి ఆర్ వో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు