★మొక్కజొన్న, ధాన్యం సేకరణ..రవాణా పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి పువ్వాడ ఆదేశాలు

◆సంబంధిత అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం జిల్లాలో మొక్క జొన్నలు, వరి ధాన్యం సేకరణ, రవాణా తదితర అంశాలపై అధికారుల అలసత్వంపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ ఆగ్రహం వ్యక్తం చేశారు.జిల్లా కలెక్టర్ V.P గౌతమ్ గారి అధ్వర్యంలో మొక్కజొన్న, ధాన్యం సేకరణ, రవాణా అంశంపై జిల్లా కలెక్టరేట్ నందు సివిల్ సప్లై, మార్కెటింగ్, వ్యవసాయ, రవాణా, పోలీస్, రైస్ మిల్లర్ల అసోసియేషన్, లారీ ఓనర్స్ అసోసియేషన్ ఇతర అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు సమీక్ష నిర్వహించారు.జిల్లా వ్యాప్తంగా 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సాగు కాగా దాదాపు 2లక్షల పై చీలుకు ధాన్యం సేకరణ కేంద్రాలు వస్తుందని, ఇప్పటి వరకు కేవలం 40వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరణ జరిగిందని అధికారుల లెక్కల ప్రకారం నమోదు అయిందన్నారు.ధాన్యం సేకరణలో బాగా వెనుకబడి ఉన్నామని, ఇలాంటి పరిస్థితి జిల్లాలో ఎప్పుడూ లేదన్నారు. కొత్త కొత్త పాలసీలు జిల్లాలో మోపి రైతులను ఇబ్బందులు పెడితే సహించేది లేదని గుర్తుంచుకోవాలని హితువు పలికారు.మీకు ప్రభుత్వంకు ఉన్న సమస్యలను రైతులపై రుద్ది వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే అందుకు సమాధానం చెప్పాల్సివస్తుందన్నారు.కరోనా క్లిష్ట సమయంలోనే 3లక్షల పై చీలుకు మెట్రిక్ టన్నల ధాన్యం సేకరించామని, ఇప్పుడు దాన్ని అందుకోలేకపోవడానికి గల కారణాలు ఏంటని ప్రశ్నించారు.మిల్లర్లు తరుగు పేరుతో 4కిలోలు తీసేయడం సరికాదని దీన్ని మార్చుకోవాలని సూచించారు.ధాన్యం రవాణాలో అంతరాయలు, అవాంతరాలు కలిగిస్తే వారి పై చర్యలకు వెనుకాడేది లేదని, ఇప్పటికైనా మీ పని తీరు మార్చుకుని ప్రభుత్వం సహకరించాలని కోరారు.ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు అనుకూల విధానాలు, రైతుబందు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు, కాళేశ్వర జలాలతో పంట విస్థీర్ణం ఏటికేడు పెరుగుతూ రికార్డు స్థాయిలో ధాన్యాన్ని సేకరిస్తున్నామన్నారు.ఎలాంటి పరిస్థితుల్లోనైనా రైతు పండించిన చివరి గింజను మద్దతు ధరతో కొనాలన్న ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలన్నారు. ప్రపంచవ్యాప్త నివేదికల్లో ఓవైపు యావత్ ప్రపంచంలో 20ఏళ్ల కనిష్టానికి బియ్యం ఉత్పత్తి పడిపోతుంటే, కేవలం తెలంగాణలో మాత్రమే బియ్యం ఉత్పత్తి ఆరింతలు పెరిగిందన్నారు ఇది తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ గారు సాధించిన ఘనత అని వెల్లడించారు.

సమీక్షలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్,విత్తనాభివృద్ది సంస్ధ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు,పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వర రావు, డీసీఎంఎస్ చైర్మన్ శేషగిరి రావు, అదనపు కలెక్టర్ మధుసుధన్, DRDA PD విద్యా చందన, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి విజయ కుమారి, జిల్లా రవాణా అధికారి తోట కిషన్ రావు, జిల్లా సివిల్ సప్లై అధికారి రాజేందర్, జిల్లా మేనేజర్ (TSCSCL) G. సోములు, మార్కెటింగ్ అధికారి నాగరాజ్, జిల్లా మేనేజర్ మార్క్ ఫెడ్ పి సునీత, రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వర రావు, లారీ అసోసియేషన్ ప్రతినిధులు భద్రం, సత్యం బాబు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు