ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మంద సంజీవరావు
ఖమ్మం : ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మంద సంజీవరావు ఆధ్వర్యంలో మహాసేన ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మయూరి సెంటర్ నుండి మంచుకొండ వరకు విజయోత్సవ ర్యాలీ ని ఘనంగా నిర్వహించారు . అనంతరం పాస్టర్స్ ఫెలోషిప్ మహాసేన మొదటి వార్షికోత్సవ ఆత్మీయ సమ్మేళనం భారీ బహిరంగ సభ మంచుకొండలో ఏర్పాటు చేయడం జరిగింది . దీనిలో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు , పాస్టర్స్.ఫెలోషిప్ మహాసేన వ్యవస్థాపకులు మరియు పాస్టర్ మంద సంజీవరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం ఏకంగా ఉండి ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసుకుంటూ పరోక్ష రాజకీయాల్లో పనిచేయాలని పిలుపునిచ్చారు . అవసరమైతే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సిద్ధంగా ఉండాలని అన్నారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం తిమోతి , నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ఐబీపీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ రెవరెండ్ బిషప్ సెబాస్ స్టీఫెన్ మరియు వారి కమిటీ సభ్యులు అలాగే ఖమ్మం జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు దారావత్ మోహన్ నాయక్ , డిసిసెల్ జిల్లా అధ్యక్షులు బండారి ప్రభాకర్ , మైనార్టీ సెల్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎస్ కే ఇసాక్ , ఉపాధ్యక్షుడు అంగడాల అనిల్ , జిల్లా ప్రధాన కార్యదర్శి పసలపూడి రమేష్ , టౌన్ అధ్యక్షులు మారపాక పృద్వి , టౌన్ బీసీ సెల్ అధ్యక్షులు పరకాల ప్రవీణ్ , రఘునాథపాలెం మండల అధ్యక్షుడు ఇమానీయులు , కొనిజర్ల మండల అధ్యక్షుడు యాకోబు , వైరా నియోజకవర్గ అధ్యక్షులు జీవరత్నం మరియు తదితరులు పాల్గొన్నారు .

