Dt:12/09/2023 Khammam శ్రీ గణేష్ మండప విద్యుత్తు వినియోగ చార్జీలను మరియు పోలీస్ పర్మిషన్ రుసుమును పువ్వాడ ఫౌండేషన్ చెల్లిస్తుందిసుడా చైర్మన్ బచ్చు విజయకుమార్. ఖమ్మం నగరంలో ఏర్పాటుచేసిన శ్రీ గణేష్ మండపాల విద్యుత్ వినియోగచార్జీలను మరియు మైక్ పర్మిషన్ రుసుమును పువ్వాడ ఫౌండేషన్ చైర్మన్ గౌరవ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు చెల్లిస్తారని సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్ గారు తెలిపారు . మంగళవారం సాయంత్రం జరిగిన శ్రీ గణేష్ మండప నిర్వాహకుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం నగరంలో శ్రీ గణేష్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకోవాలని వారు కోరారు . అదేవిధంగా ఏసిపి హరికృష్ణ మాట్లాడుతూ శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ఐకమత్యంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలని ప్రతి ఒక్కరు విధిగా పరిమిషన్ తీసుకోవాలని వారు కోరారు . ఉత్సవ సమితి అధ్యక్షుడు వినోదలహొటి మాట్లాడుతూ శ్రీ గణేష్ మండప నిర్వాహకులకు ప్రభుత్వానికి మధ్య వారధిలా స్తంభాద్రి ఉత్సవ సమితి బాధ్యతలు నిర్వహిస్తుందని ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో విగ్నేషుని పూజించాలని వారి కోరారు . ఈ కార్యక్రమంలో సిఐలు స్వామి , కుమారస్వామి , సత్యనారాయణ మరియు గౌరవ సలహాదారులు వెంపటి లక్ష్మీనారాయణ , వర్కింగ్ ప్రెసిడెంట్ గెంటేల విద్యాసాగర్ , కార్యదర్శి కీసర జైపాల్ రెడ్డి , కన్వీనర్ కన్నం ప్రసన్న కృష్ణ , మరియు నాయకులు పాలడుగు పాపారావు, అల్లిక అంజయ్య , మూలగుండ్ల శ్రీహరి మరియు తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు