







ఖమ్మం జులై 14: వి ఎన్ బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పాలేరు
ఖమ్మం రూరల్ మండలం కొండాపురం, అరేంపుల, తనగాంపాడు గ్రామాల్లో సి.సి., బి.టి. రోడ్లుకు శంకుస్థాపన లు చేసిన రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణం మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
ఆదివారం ఖమ్మం రూరల్ మండలలో కొండాపురం, అరేంపుల, తనగాంపాడు గ్రామాల్లో రూ.28 లక్షల రూపాయలతో సిసి, బిటి రోడ్లకు ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం
గూడూరుపాడులో 20 లక్షల రూపాయలతో పల్లె దావఖన ప్రారంభించారు. తిరిగి వెళ్లే క్రమంలో వ్యవసాయ కూలీలతో మంత్రి మాట్లాడారు. కూలీలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.రోజు వారి కూలి ఎంత వస్తుందని తెలుసుకోవడం తో పాటు రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. తమ పిల్లలు చదువులు పూర్తయినా ఉద్యోగాలు రాలేదని కూలీలు ఆయనకు చెప్పడంతో తమ ప్రభుత్వం లో ఉద్యోగాలు ఇస్తున్నామని వారికి ఆయన తెలిపారు. పలువురు కూలీలు కౌలు రైతుల సమస్యలను కూడా శ్రీనివాస రెడ్డి దృష్టికి తీసుకురాగా వారికి కూడా న్యాయం జరుగుతుందని మంత్రి తెలిపారు.
కార్యక్రమం లో ఆర్ అండ్ బి ఎస్.ఈ. హేమలత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మాలతీ, ఆర్డిఓ గణేష్, పి.ఆర్. ఇఇ వెంకటరెడ్డి, ఎం. శ్రీనివాసరావు, మిషన్ భగీరథ ఇఇ లు పుష్పలత, వాణిశ్రీ, ఇరిగేషన్ ఇ ఇ వెంకటేశ్వర రావు, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి ఖమ్మం వారి చే జారీ చేయనైనది
