
Dt:12/09/2023 Khammam శ్రీ గణేష్ మండప విద్యుత్తు వినియోగ చార్జీలను మరియు పోలీస్ పర్మిషన్ రుసుమును పువ్వాడ ఫౌండేషన్ చెల్లిస్తుంది – సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్. ఖమ్మం నగరంలో ఏర్పాటుచేసిన శ్రీ గణేష్ మండపాల విద్యుత్ వినియోగచార్జీలను మరియు మైక్ పర్మిషన్ రుసుమును పువ్వాడ ఫౌండేషన్ చైర్మన్ గౌరవ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు చెల్లిస్తారని సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్ గారు తెలిపారు . మంగళవారం సాయంత్రం జరిగిన శ్రీ గణేష్ మండప నిర్వాహకుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం నగరంలో శ్రీ గణేష్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకోవాలని వారు కోరారు . అదేవిధంగా ఏసిపి హరికృష్ణ మాట్లాడుతూ శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ఐకమత్యంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలని ప్రతి ఒక్కరు విధిగా పరిమిషన్ తీసుకోవాలని వారు కోరారు . ఉత్సవ సమితి అధ్యక్షుడు వినోదలహొటి మాట్లాడుతూ శ్రీ గణేష్ మండప నిర్వాహకులకు ప్రభుత్వానికి మధ్య వారధిలా స్తంభాద్రి ఉత్సవ సమితి బాధ్యతలు నిర్వహిస్తుందని ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో విగ్నేషుని పూజించాలని వారి కోరారు . ఈ కార్యక్రమంలో సిఐలు స్వామి , కుమారస్వామి , సత్యనారాయణ మరియు గౌరవ సలహాదారులు వెంపటి లక్ష్మీనారాయణ , వర్కింగ్ ప్రెసిడెంట్ గెంటేల విద్యాసాగర్ , కార్యదర్శి కీసర జైపాల్ రెడ్డి , కన్వీనర్ కన్నం ప్రసన్న కృష్ణ , మరియు నాయకులు పాలడుగు పాపారావు, అల్లిక అంజయ్య , మూలగుండ్ల శ్రీహరి మరియు తదితరులు పాల్గొన్నారు .
