KHAMMAM/29.09.2023

వి ఎన్ బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు

ఖమ్మం నగరంలోని 33, 34, 35వ డివిజన్ లలో రూ.1.34 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

▪️ఖమ్మం నగరం 35వ డివిజన్ మోతి నగర్ నందు LRS నిధులు రూ.60లక్షలతో నిర్మించనున్న సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ డివైడర్ పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు శంకుస్థాపన చేశారు. అనంతరం suda నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన VDF రోడ్స్ లను ప్రారంభించారు.

▪️34వ డివిజన్ నందు LRS నిధులు రూ.24 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్స్(VDF రోడ్స్) కు శంకుస్థాపన చేశారు.

▪️33వ డివిజన్ నందు LRS నిధులు రూ.25 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్స్(VDF రోడ్స్) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖమ్మం నగరంలో ప్రతి డివిజన్ లో ప్రజల అవసరాల మేరకు వెతికి వెతికి రోడ్లు, డ్రెయిన్లు, త్రాగునీరు ఇతర సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు.

కేవలం అభివృద్ది కోసమే BRS ప్రభుత్వం ప్రతి డివిజన్ కు దాదాపు 13కోట్ల రూపాయలు ఇప్పటికే వెచ్చించి పనులు చేపట్టడం జరిగిందని, SDF నిధులు రూ.50 కోట్లతో సీసీ డ్రైన్లు నిర్మిస్తున్నామని చెప్పారు.

అవసరం ఉన్న మేరకు మరిన్ని నిధులు వెచ్చించి ఇంకా అరకొర రోడ్లు, డ్రైన్ లు వేసేందుకు సిద్దంగా ఉన్నామని వివరించారు.

ప్రజల కోసం ఇంత చేస్తున్న BRS ప్రభుత్వంను ప్రజలు ఆదరించాలని, వచ్చే ఎన్నికల్లో BRS ప్రభుత్వం ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్లు రుద్రగాని శ్రీదేవి, తోట ఉమారాణి, పసుమర్తి రాంమోహన్, AMC చైర్మన్ దోరేపల్లి శ్వేత, RJC కృష్ణ, రుద్రగాని ఉపేందర్, తోట వీరభద్రం, నున్నా మాధవ రావు, వెంపటి నాయుడు కన్నం ప్రసన్న కృష్ణ, బాలిని శ్రీనివాస్, బోజడ్ల రాం మోహన్, బండి నవీన్, కే.నాగరాజు, సంపత్, వెంకటేష్ పాషా తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed