తేజ వార్త పత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ

ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో చేపట్టిన పలు అభివృద్ది పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

మొత్తం రూ.1.47కోట్లతో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

▪️18వ డివిజన్ శ్రీరామ్ హిల్స్ నందు రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ (VDF)రోడ్స్ ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, మున్సిపల్ సాధారణ నిధులు రూ.32.96లక్షలతో ఎర్పాటు చేసిన పార్క్ ను ప్రారంభించారు.

▪️18వ డివిజన్ శ్రీరాం నగర్ రోడ్ నెం.10లో LRS నిధులు రూ.50లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

▪️31 వ డివిజన్ పంపింగ్ వెల్ రోడ్ నందు SUDA నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన VDF సీసీ రోడ్స్ ను ప్రారంభించారు. LRS నిధులు రూ.15లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

మొత్తం రూ.1.47కోట్లతో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్ లలో ప్రజల విజ్ఞప్తి మేరకు ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు.

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేవలం నాలుగేళ్ల వ్యవధిలో రాష్ట్రంలో ఎక్కడ జరగనంత అభివృద్ది అనతికాలంలోనే చేసి చూపించాం..

కనీసం నడవడానికి కూడా సరైన రోడ్డు మార్గం లేని పరిస్థితుల నుండి నేడు అన్ని ప్రధాన రహదారులు విస్తరించి సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ డివైడర్ లు ఎర్పాటు చేసి, అన్ని గల్లీలలో VDF టెక్నాలజీతో సీసీ రోడ్లు నిర్మించి ప్రజా రవాణాను మెరుగు పరచడం జరిగిందన్నారు.

ప్రజలు ఇది గమనించాలని కోరారు. ప్రతి ఇంటి ముందు సీసీ డ్రైన్ లతో పాటు సీసీ రోడ్లు నేడు ఉన్నాయని, వీటితో పాటు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా శుద్ధమైన త్రాగునీరు అందించడం జరిగిందన్నారు.

మంత్రి పదవి బాధ్యతలు చేపట్టినందుకు ఖమ్మం నగరాన్ని ఉన్నత స్థితికి తీసుకురావడం గర్వంగా ఉందని, వేల కోట్ల నిధులు ఇస్తు నన్ను ప్రోత్సహించిన సిఎం కేసీఅర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.

ఇంకా మరింత అభివృధ్ది జరగాలన్న, మరిన్ని సౌకర్యాలు, వసతులు రావాలన్న వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మన BRS ప్రభుత్వంను అత్యధిక మెజారిటీ తో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, డిఈ ధరణి, RJC కృష్ణ, కార్పొరేటర్లు మందడపు లక్ష్మీ మనోహర్, తోట ఉమారాణి వీరబద్రం, రుద్రగాని శ్రీదేవి ఉపేందర్, మేడారపు వెంకటేశ్వర్లు, బండారు శ్రీనివాస్, రమాదేవి, దండగల రాంబాబు, వెంపటి నాయుడు వేముల వీరయ్య, వల్లేపు భద్రం, తమ్మిశెట్టి గోవింద్, వల్లెపు శ్రీను, కృష్ణ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed