తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణ సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తనను కలవడానికి వచ్చిన ప్రజాప్రతినిధులకు, అభిమానులకు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు ఎవరు అయినా పూల బొకేలు, సాల్వలు, ఫ్లెక్సీలకు అయ్యే ఖర్చును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందివ్వాలని విజ్ఞప్తి చేశారు… ఆ పిలుపుమేరకు కూసుమంచి ఎంపీటీసీ సభ్యులు మాదాసు ఉపేందర్ రావు గారు – 5000/- కూసుమంచి సర్పంచ్ చెన్న మోహన్ రావు గారు – 5000/- అలాగే కూసుమంచి వర్తక సంఘం అధ్యక్షులు చౌడవరపు కృష్ణారావు గారు – 5000/- పొంగులేటి శ్రీనన్నకు 15,000/- రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి కోసం చెక్కుల రూపంలో అందించడం జరిగింది.

