మంత్రి పొంగులేటి పాలేరు క్యాంప్ కార్యాలయ ప్రవేశ పూజలు

కూసుమంచి: తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ప్రభుత్వం అధికారికంగా కేటాయించిన కూసుమంచిలోని పాలేరు నియోజక వర్గ క్యాంప్ కార్యాలయ ప్రవేశ పూజలు శనివారం జరిగాయి. మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, ముఖ్య నాయకులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అంతా విజయవంతం కావాలని ఈ సందర్భంగా వారు మొక్కుకున్నారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి కార్యాలయంలోకి ప్రవేశించారు. మంత్రి పొంగులేటి నేతృత్వంలో ప్రజలందరికీ సుపరిపాలన అందించేలా.. ఈ కార్యాలయం ఎంతో ఉపయోగపడుతుందని దయాకర్ రెడ్డి ఆకాంక్షించారు. పాలేరు నియోజక వర్గంతో పాటు ఇతర నియోజక వర్గాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, నాయకులు రామసహాయం నరేష్ రెడ్డి, ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి , చావా శివ రామకృష్ణ, నేలకొండపల్లి ఎంపీపీ వజ్జా రమ్య, తిరుమలాయపాలెం ఎంపీపీ బోడ మంగీలాల్, కూసుమంచి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మట్టే గురవయ్య, ఖమ్మం రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కళ్లెం వెంకట్ రెడ్డి, మద్ది వీరా రెడ్డి, బైరు హరినాథ్ బాబు, సర్పంచ్ లు గోనె భుజంగ రెడ్డి, శివా రెడ్డి, కె.వి. చారి, మద్ది కిషోర్ రెడ్డి , అజ్మీరా అశోక్ నాయక్ , కొప్పుల చంద్ర శేఖర్, సుదాగని ఉపేందర్, మాజీ ఎంపీపీలు రామసహాయం వెంకటరెడ్డి, జూకూరి గోపాల్ రావు, కొంగర జ్యోతిర్మయి, ఉమ్మినేని కృష్ణ, యడవల్లి ముత్తయ్య, బజ్జూరి వెంకట్ రెడ్డి, పెండ్ర అంజయ్య, హఫీజుద్దీన్, యడవల్లి రాంరెడ్డి , బారి వీరభద్రం, మదాసు ఉపేందర్, ఇందుర్తి వెంకట్ రెడ్డి , లెనిన్ , సర్పంచ్ ఖాదర్ బాబా, నెల్లూరి భద్రయ్య, కొడాలి గోవింద రావు, శాఖమూరి రమేష్, కుక్కల హనుమంత రావు, వెన్నపూసల సీతా రాములు, మామిడి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు